Pawan Kalyan: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల భక్తులకు పవన్ కల్యాణ్ కీలక విజ్ఞప్తి

Pawan Kalyan: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లిన భక్తులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక విజ్ఞప్తి చేశారు.

Pawan Kalyan: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల భక్తులకు పవన్ కల్యాణ్ కీలక విజ్ఞప్తి

AP Deputy CM Pawan Kalyan

Updated On : January 10, 2025 / 1:01 PM IST

Pawan Kalyan: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవ దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. గురువారం అర్థరాత్రి నుంచే భక్తులు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు ఆలయాల వద్దకు చేరుకున్నారు. అర్చకులు ప్రత్యేక పూజల అనంతరం ఉత్తర ద్వార దర్శనానికి అనుమతి ఇవ్వడంతో భక్తులు ఉత్తరద్వారం ద్వారా స్వామివారిని దర్శనం చేసుకున్నారు. మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారికి దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ట్విటర్ వేదికగా ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లిన భక్తులకు కీలక విజ్ఞప్తి చేశారు.

Also Read: Pawan Kalyan: పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..

పవన్ ట్వీట్ ప్రకారం.. ‘‘ ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు. ఈ సందర్భంగా స్వామి వారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకునేందుకు వెళ్తున్న భక్తులు, ముఖ్యంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, త్రోపులాటలకు తావివ్వకుండా, ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణంలో, భక్తితో దర్శనం చేసుకుని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ప్రార్ధిస్తున్నాను’’ అంటూ పేర్కొన్నారు.

Also Read: TTD: తిరుపతి ఘటనలో క్షతగాత్రులకు వైకుంఠ ద్వార దర్శనం చేయించిన టీటీడీ.. వారేమన్నారంటే?

తిరుపతిలో రెండు రోజుల క్రితం విషాద ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తిరుపతిలోని వైకుంఠద్వార దర్శనాల టోకెన్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు మృతిచెందగా.. పలువురు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తిరుపతి ఘటన దేశవ్యాప్తంగా శ్రీవారి భక్తులను ఆందోళనకు గురిచేసింది. అయితే, గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుమలకు వెళ్లారు. తొక్కిసలాట ఘటనలో గాయపడిన వారిని పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. మరోసారి తిరుపతి ఇలాంటి విషాద ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ క్రమంలో త్రోపులాటలకు తావులేకుండా, ఆధ్యాత్మిక వాతావరణంలో స్వామివారిని దర్శించుకోవాలని తిరుమల వెళ్లిన భక్తులకు పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేస్తూ ట్వీట్ లో పేర్కొన్నారు.

Also Read: Gossip Garage : తెలంగాణ మంత్రులు అలిగారా? తమను చిన్నచూపు చూశారని అవమానంగా ఫీలవుతున్నారా?

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల శ్రీవారిని తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రులు వంగలపూడి అనిత, పార్థసారథి, సవిత, నిమ్మల రామానాయుడుతో పాటు తెలంగాణ డిప్యూటీ సీఎ భట్టి విక్రమార్క, తెలంగాణ స్పీకర్, పలువురు తెలంగాణ ప్రాంతానికి చెందిన రాజకీయ ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిధంగా స్వామివారిని దర్శించుకున్న వారిలో నందమూరి రామకృష్ణ, నందమూరి బాలకృష్ణ సతీమణి వసుందర, సుహాసిని, రాజేంద్ర ప్రసాద్, బండ్ల గణేశ్ తో పాటు పలువురు ప్రముఖులు శుక్రవారం తెల్లవారు జామున ఉత్తర ద్వారం నుంచి శ్రీవారిని దర్శించుకున్నారు.