కవాతు నిర్వహించాలా ? వద్దా ? : నేతలతో పవన్ కళ్యాణ్ భేటీలు

  • Publish Date - January 10, 2020 / 09:23 AM IST

జనసేనానీ మళ్లీ దూకుడు పెంచారు. రాజధానిని అమరావతిలోనే ఉంచాలంటూ..ఆందోళన చేసిన పవన్..పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా మంగళగిరి పార్టీ కార్యాలయానికి 2020, జనవరి 10వ తేదీన అమరావతికి చేరుకున్నారు పవన్. అక్కడ కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాలకు చెందిన నేతలతో పవన్ భేటీ అవుతున్నారు. పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. రాజధాని అంశంపై పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. వారం రోజుల పాటు ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చే విధంగా వ్యూహాలు రచిస్తున్నారు జనసేనానీ. 

కొద్ది రోజుల క్రితం రాజధాని ప్రాంతంలో క్షేత్రస్థాయిలో జనసేనానీ పర్యటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజధాని ప్రాంతాల్లో ఆందోళనలు ఉధృతమౌతున్న దృష్ట్యా..పవన్ భేటీలు జరుపుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజధాని రైతులకు అండగా ఉండేందుకు..మరోసారి కవాతను నిర్వహించాలని పవన్ నిర్ణయం తీసుకున్నారు. లక్ష మందితో విజయవాడలో కవాతు నిర్వహించేందుక ప్లాన్ నిర్వహిస్తున్నారు. నేతలతో చర్చల అనంతరం, జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో జనసేనానీ నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. రాజధాని రైతులకు అండగా ఉంటానని ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రాజధాని రైతులకు, ప్రధానంగా యువతలో కొత్త ఉత్సాహం నింపేలా ప్రణాళికలు రచిస్తున్నారు. 

ఆందోళనలతో అమరావతి అట్టుడుకుతోంది. రాజధాని గ్రామాల్లో మహిళలు, రైతుల నినాదాలు హోరెత్తుతున్నాయి. ముఖ్యంగా మందడం, తుళ్లూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిరసనలో భాగంగా ఇంద్రకీలాద్రికి పాదయాత్ర చేపట్టిన మహిళలకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఎక్కడికక్కడ పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. దీంతో పలుచోట్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

Read More : వైరల్ వీడియో : సారా చేయిని ముద్దాడిన ఫ్యాన్