ఆంధ్రప్రదేశ్‌లో మాదక ద్రవ్యాలు పెనుముప్పుగా మారాయి: ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ ట్వీట్

మాజీ సీఎం జగన్ పాలనలో మాదక ద్రవ్యాల మాఫియా బాగా అభివృద్ధి చెందిందని విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్‌లో మాదక ద్రవ్యాలు పెనుముప్పుగా మారాయంటూ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ ట్వీట్ చేశారు. ఇది వైసీపీ అవినీతి, నేర పాలన నుంచి సంక్రమించిన మరో వారసత్వ సమస్య అని పవన్ విమర్శించారు.

ఏపీలో మాదకద్రవ్యాల మాఫియాతో పాటు గంజాయి సాగు, సంబంధిత నేర కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించాలని పవన్ కల్యాణ్ అన్నారు. అప్పట్లో విశాఖపట్నం ఓడరేవులో కొకైన్ షిప్‌మెంట్‌ను స్వాధీనం చేసుకున్నారని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. అప్పట్లో ఈ ఘటన ఏపీలో కలకలం రేపిన విషయం తెలిసిందే.

దేశంలోని ఇతర ప్రాంతాల్లో పట్టుబడిన డ్రగ్స్‌కు విజయవాడలోని ఒక వ్యాపార సంస్థతో సంబంధాలు ఉన్నాయని పవన్ కల్యాణ్ తెలిపారు. మాజీ సీఎం జగన్ పాలనలో మాదక ద్రవ్యాల మాఫియా బాగా అభివృద్ధి చెందిందని విమర్శించారు. నేరగాళ్లను కట్టడి చేసేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అవసరమని అన్నారు.

Srisailam: శ్రీశైలం పుణ్యక్షేత్రానికి పోటెత్తిన భక్తులు