Srisailam: శ్రీశైలం పుణ్యక్షేత్రానికి పోటెత్తిన భక్తులు
కర్నూలు ఉమ్మడి జిల్లాలో శ్రీశైలంతో పాటు యాగంటి, మహానంది, ఉరుకుంద పుణ్యక్షేత్రలకు భక్తుల తాకిడి పెరిగింది.

Srisailam Temple
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. కార్తీక శనివారం కావడంతో భారీగా తరలివచ్చారు. రెండవ శనివారం సెలవులు కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి భక్తులు పూజల్లో పాల్గొంటున్నారు.
భక్తులతో శైవ క్షేత్రం కిటకిటలాడుతోంది. శివనామస్మరణతో శివగిరి మారుమోగుతోంది. కార్తీక మాసోత్సవాలు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తదితర రాష్ట్రాలకు చెందిన భక్తులు శ్రీశైలం చేరుకున్నారు. పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకుంటున్నారు.
భక్తిశ్రద్ధలతో కార్తీక దీపాలు వెలిగించి పూజలు నిర్వహిస్తున్నారు మహిళలు. కార్తీక శనివారం కావడంతో శివుని దర్శనం చేసుకుంటున్నారు. కర్నూలు ఉమ్మడి జిల్లాలో శ్రీశైలంతో పాటు యాగంటి, మహానంది, ఉరుకుంద పుణ్యక్షేత్రలకు భక్తుల తాకిడి పెరిగింది. శైవ క్షేత్రాల్లో భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నారు.
Drunk Driving Cases: హైదరాబాద్‌లో తీరు మార్చుకోని మందుబాబులు.. పలు చోట్ల డ్రంకెన్ డ్రైవ్ కేసులు