Tirupati Stampede Tragedy : తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనలో పోలీసుల వ్యవహార శైలిపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గరుడ సేవకు 4 లక్షల మంది వస్తే ఇటువంటి ఘటనలు జరగలేదు, కేవలం 2500 మందిని మేనేజ్ చేయలేకపోయారా? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
ఈ తొక్కిసలాట ఘటనపై కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయన్నారు. ఇప్పుడు దీనిపై నేను మాట్లాడను, జ్యుడీషియల్ విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని కీలక వ్యాఖ్యలు చేశారు పవన్. పోలీసుల తీరుపై డీజీపీ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.
Also Read : తిరుపతి ఘటనపై స్పందించిన మాజీ మంత్రి రోజా.. వారిద్దరి వల్లే ఈ పరిస్థితి అంటూ ఆగ్రహం
”జరిగిన ఘటనపై టీటీడీ ఈవో, అదనపు ఈవో, ప్రతి పోలీసు బాధ్యత తీసుకోవాలి. పోలీసులు క్రౌడ్ మేనేజ్ చేయటం లేదు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడటం బోర్డు బాధ్యత. ఈవో, అదనపు ఈవోలు విఫలం అయ్యారు. పోలీసులు సరిగా పట్టించుకోవడం లేదు. డిప్యూటీ సీఎం హోదాలో మేము బాధ్యతలు తప్పించుకోవడం లేదు. మేము పూర్తి బాధ్యత తీసుకుంటాం.
టీటీడీ బోర్డు వీఐపీలపై ఫోకస్ తగ్గించి సామాన్యులపై ఫోకస్ పెంచాలి. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకూడదు. డిజాస్టర్ మేనేజ్ మెంట్ వ్యవస్థ సరిగా లేదు. జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారు” అని పవన్ కల్యాణ్ అన్నారు.
Also Read : తిరుపతి తొక్కిసలాట ఘటన దురదృష్టకరం.. ప్రభుత్వ వైఫల్యమే కారణం : అంబటి రాంబాబు