Pawan Kalyan (Photo : Twitter)
Pawan Kalyan – YSRCP : ఏపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) నిప్పులు చెరిగారు. పంచాయతీరాజ్ వ్యవస్థను(Panchayati Raj System) నాశనం చేశారని పవన్ మండిపడ్డారు. వాలంటీర్ల ద్వారా అధికారాలు లాక్కుంటారా అని ధ్వజమెత్తారు. జనసేన కార్యాలయంలో సర్పంచ్‌ల సమావేశం ఏర్పాటు చేశారు. పంచాయతీలను కాపాడుకుందామనే అంశంపై ఇందులో చర్చించారు. ఈ భేటీలో తమ సమస్యలను, అభిప్రాయాలను పవన్ కు తెలియజేశారు సర్పంచ్ లు.
”గ్రామ సభలు పెట్టకుండా పంచాయతీ రాజ్ వ్యవస్థను నాశనం చేశారు. కొన్ని దశాబ్దాలుగా ఈ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ వస్తున్నారు. వైసీపీ వచ్చాక అది మరింత విస్తృతం చేసి పూర్తిగా నాశనం చేశారు. కేరళ లో పంచాయతీ రాజ్ వ్యవస్థ పై అధ్యయనం చేయాలి. సర్పంచ్ లు క్షేత్ర స్థాయిలో సమస్యలు, ఇబ్బందులు వివరించారు. తండాల్లో మంచి నీరు దొరకని పరిస్థితి కన్నీళ్లు తెప్పించింది. ఏపీలో పంచాయతీ నిధులు దుర్వినియోగంపై కేంద్ర పెద్దలు కూడా చెప్పారు. కేంద్ర నిధులు నేరుగా గ్రామాలకు చేర్చి దుర్వినియోగాన్ని కట్ చేస్తాం.(Pawan Kalyan)
గ్రామీణ నిధులు మళ్లించడం డెకాయిట్, దోపిడీగా చూడాలి. ఇటువంటి వాటిపై పెద్ద ఎత్తున ఉద్యమం జరగాలి. గ్రామసభలు నడిపేలా అందరూ కలిసి వచ్చేలా మోటివేట్ చేస్తాం. పంచాయతీలకే నిధులు వచ్చేలా మా వంతు కృషి చేస్తాం. 73,74 రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామాలకు అధికారాలు ఇచ్చింది. మన రాజ్యాంగాన్ని పాలకులే అమలు చేయకపోతే ఎలా? కేంద్రం నిర్దేశించిన బ్యాంకుల ద్వారా సర్పంచ్ లకే నిధులు రావాలి. దీనిని కేంద్ర జాతీయ నాయకత్వం దృష్టికి బలంగా తీసుకెళతాం” అని పవన్ కల్యాణ్ అన్నారు.
”వాలంటీర్ వ్యవస్థను తెచ్చి పంచాయతీ రాజ్ కు పోటీగా నడుపుతున్నారు. ప్రజలకు చేరువ అయ్యే మనుషులుగా కాకుండా వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలుగా ఉన్నారు. డబ్బులు పెట్టి, కష్టపడి ఎన్నికల్లో విజయం సాధిస్తే.. సర్పంచ్ లకు హక్కులు లేవా. న్యాయం అడిగితే… కేసులు, అరెస్టులా? అందరూ కలిసికట్టుగా గ్రామీణాభివృద్ధి కోసం పోరాటం చేయాలి. పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతం చేసేలా జనసేన మ్యానిఫెస్టోలో పెడతాం. గాంధీజీ వంటి వారికే విమర్శలు తప్పలేదు.(Pawan Kalyan)
నేను అన్నీ తట్టుకునేందుకు సిద్దమై వచ్చా. కేంద్రం ఎన్ని నిధులు పంపినా అవి దుర్వినియోగం అయిపోతున్నాయి. అధికారం ఉంది కదా అని.. పంచాయతీల డబ్బు దొంగతనం చేస్తారా? అటువంటి వారిని దొంగలు అనకుండా ఏమంటారు? వాలంటీర్ల ద్వారా సర్పంచ్ ల అధికారాలను లాక్కుంటారా? సర్పంచ్ లకు ఎన్నికలు పెట్టకుండా ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకుంటారా? అధికార మదంతో అడ్డగోలుగా పని చేయకూడదు. ఏకగ్రీవాలకు జనసేన వ్యతిరేకం. దీనిపై కేంద్రం చట్టం చేయాలని కోరుతున్నా.
Also Read..AP Volunteers: వలంటీర్ల వేతనాల పెంపుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం?
కొన్నిచోట్ల పోటీ చేసిన వాళ్లను భయపెట్టి హింసించారు. ఒకచోట ఏకంగా అభ్యర్థిని చంపేశారు. ఎన్నికల్లో పోటీ చెసే హక్కు అందరికీ ఉంటుంది. రాజ్యాంగం కల్పించిన హక్కు కాలరాసే హక్కు సీఎంకు కూడా లేదు. సర్పంచ్ లకు సంపూర్ణంగా చెక్ పవర్ ఉండాలి. మేధావులతో కూడా మాట్లాడి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాం. సర్పంచ్ లు వాలంటీర్ వ్యవస్థపై దృష్టి పెట్టండి. మీకు 3వేలు, వాలంటీర్లకు 5 వేలా? మీ హక్కులు, అధికారాలు లాక్కుంటారా? వాలంటీర్ వ్యవస్థలో లోపాలపై అందరూ అధ్యయనం చేయండి. భవిష్యత్తులో పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతం దిశగా అడుగు వేద్దాం” అని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.