Pawan
Pawan Kalyan tweet on drugs supply : ఏపీలో డ్రగ్స్ సరఫరాపై రగడ కొనసాగుతోంది. ఇప్పటికే వైసీపీ, టీడీపీల మధ్య మాటల యుద్ధం నడుస్తుండగా.. ఇప్పుడు డ్రగ్స్ రగడలో జనసేన కూడా ఎంట్రీ అయ్యింది. ఏపీలో డ్రగ్స్ సరఫరాపై పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. ఏపీ నార్కోటిక్స్ హబ్‌గా మారిందన్నారు.
అనేక మంది డ్రగ్స్ లార్డ్‌లతో ఏపీ నిండిపోయిందని తెలిపారు. దేశంపై ప్రభావం చూపుతుందని సమస్యను ప్రభుత్వ పెద్దలు దాచిపెడుతున్నారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఏపీ నుంచే గంజాయి సరఫరా అవుతుందన్న..నల్లగొండ ఎస్పీ రంగనాథ్ వీడియోను పవన్ ట్విట్టర్‌లో పోస్టు చేసిశారు.
Corona Virus: మళ్లీ కరోనా కల్లోలం.. చైనాలో లాక్‌డౌన్.. భయం గుప్పెట్లో భారత్!
మరోవైపు ఏపీ, ఒరిస్సా సరిహద్దులో గిరిజన గ్రామాలలో గతంలో తాను చేసిన యాత్రను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విటర్ వేదికగా గుర్తు చేసుకున్నారు. తన పోరాట యాత్ర 2018లో రాష్ట్ర ప్రజల సామాజిక, ఆర్థిక సమస్యలను అర్థం చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడిందన్నారు.
ఆంధ్రా ఒరిస్సా సరిహద్దులోని గిరిజన ప్రాంతాలలో అనేక ఫిర్యాదులు వచ్చాయని పవన్ కల్యాణ్ అన్నారు. ఆరోగ్యం, నిరుద్యోగం, అక్రమ మైనింగ్, గంజాయి వ్యాపారం అక్కడ మాఫియా.. గురించి గిరిజనులు బాధపడుతున్నారని ట్వీట్ చేశారు. అలాగే అక్కడ తన పర్యటనకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు.