Corona Virus: మళ్లీ కరోనా కల్లోలం.. చైనాలో లాక్‌డౌన్.. భయం గుప్పెట్లో భారత్!

కరోనా పుట్టినిల్లు చైనాలో మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కొద్ది రోజులుగా కొవిడ్ కేసుల సంఖ్య ఎక్కువ అవుతుండడంతో డ్రాగన్ కంట్రీ అప్రమత్తమైంది.

Corona Virus: మళ్లీ కరోనా కల్లోలం.. చైనాలో లాక్‌డౌన్.. భయం గుప్పెట్లో భారత్!

Corona

Corona Virus: కరోనా పుట్టినిల్లు చైనాలో మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కొద్ది రోజులుగా కొవిడ్ కేసుల సంఖ్య ఎక్కువ అవుతుండడంతో డ్రాగన్ కంట్రీ అప్రమత్తమైంది. మరోసారి ఆంక్షలు విధించేందుకు సిద్ధమైంది. ముందు జాగ్రత్త చర్యగా పలు ప్రాంతాల్లో స్కూళ్లు, పర్యాటక ప్రదేశాలను మూసేసింది చైనా. లేటెస్ట్‌గా 40లక్షల జనాభా కలిగిన లాన్‌జువో నగరంలో లాక్‌డౌన్‌ విధించింది.

పదిరోజులుగా అక్కడ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండగా.. వాయువ్య ప్రావిన్స్ గన్సుకు చెందిన లాన్‌జౌలో ఆరు కేసులతో సహా 29 కొత్త దేశీయ ఇన్‌ఫెక్షన్లు వచ్చాయి. దీంతో చైనా లాక్‌డౌన్‌ విధిస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని అక్కడి అధికారులు హెచ్చరికలు జారీచేశారు. రాకపోకలపై నియంత్రణ విధిస్తూ.. అత్యవసర సేవలు, నిత్యావసర వస్తువులు, వైద్య చికిత్సలకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు

చైనాలోని అనేక ప్రాంతాల్లో, డెల్టా వేరియంట్‌కు చెందిన కరోనా వైరస్‌ వ్యాప్తి నిరంతరం పెరుగుతోంది. దీంతో చైనా వాయువ్య ప్రాంతంలోని ఇన్నర్ మంగోలియాలోని ఐజిన్ కౌంటీలో నిన్న పూర్తి లాక్ డౌన్ విధించారు. ఏజిన్‌లో గతవారం 150కి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. చైనాలో ఒక వారంలో, కోవిడ్ సంక్రమణ 11 రాష్ట్రాలకు వ్యాపించినట్లు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది.

చైనాలో పరిస్థితులు ఇబ్బందిగా ఉండడంతో భారత్‌లో కూడా మళ్లీ కేసులు పెరుగుతాయేమో అనే భావనతో చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నారు అధికారులు. ప్రజలు కూడా మూడో వేవ్ వస్తుందేమో భయంతో ఉన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నారు అధికారులు.

గతేడాది కొవిడ్‌ ఫస్ట్ వేవ్ మార్చిలో మొదలైనా.. మే నుంచి సెప్టెంబరు వరకూ తీవ్రమైన పరిస్థితులు కనిపించాయి. ఆ తర్వాత పండుగలు, శుభకార్యాల నిర్వహించినా.. కేసుల సంఖ్య మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. అయితే ఈ ఏడాది మార్చి వచ్చేసరికి సెకండ్ వేవ్ ఒక్కసారిగా స్టార్ట్ అయ్యింది. డెల్టా వేరియంట్‌ ప్రవేశంతో మే-జూన్‌ నెలల్లో తీవ్రనష్టం జరిగిపోయింది.