Pawan Kalyan: మహాకుంభ మేళాలో సతీసమేతంగా పవన్‌ కల్యాణ్ పుణ్యస్నానం.. జంధ్యంతో ఉన్న ఫొటోలు వైరల్

పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవాతో పాటు కుమారుడు అకిరానందన్ కూడా ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇవాళ మహా కుంభమేళాలో పుణ్యస్నానమాచరించారు. ఆయన సమయంలో పవన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. యూపీలోని ప్రయాగరాజ్ వద్ద త్రివేణి సంగమంలో వారంతా కలిసి పుణ్యస్నానాలాచరించారు.

పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవాతో పాటు కుమారుడు అకిరానందన్ కూడా ఉన్నారు. పవన్ వెంట దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం ఉండడం గమనార్హం. పవన్ కల్యాణ్ జంధ్యంతో ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

Also Read: మీరు ఐటీఆర్ ఆలస్యంగా వేస్తే మీకు రిఫండ్‌ రాదా? పూర్తి క్లారిటీ ఇచ్చిన ఐటీ శాఖ

పుణ్యస్నానం ఆచరించిన సమయంలో ఆయన చొక్కాను తీసేసి, ధోతీపైనే నీటి మునిగారు. పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులు గంగాదేవికి పూజలు చేసి.. హారతులు ఇచ్చారు. కుంభమేళాకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు.

సామాన్య భక్తులతో పాటు దేశ విదేశాల్లోని ప్రముఖులు కూడా తరలివస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్‌ కూడా సతీసమేతంగా మహా కుంభమేళాలో పుణ్యస్నానమాచరించిన విషయం తెలిసిందే.

భక్తులు పవిత్ర నదిలో స్నానం చేస్తూ తరించిపోతున్నారు. దేశ విదేశాల నుంచి లక్షలాది మంది సాధువులు, భక్తులు హాజరవుతున్నారు. శివతాండవం, భాగవత పారాయణం, గంగా ఆరతి వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఇందులో భాగంగా నిర్వహిస్తున్నారు.