New Income Tax Bill: మీరు ఐటీఆర్ ఆలస్యంగా వేస్తే మీకు రిఫండ్ రాదా? పూర్తి క్లారిటీ ఇచ్చిన ఐటీ శాఖ
చాలా మందిలో ఉన్న ఈ ప్రశ్నకు ఐటీ శాఖ సమాధానం చెప్పింది.

ప్రతి ఏడాది రిటర్నులు దాఖలు చేయడానికి ఆదాయపన్ను శాఖ వ్యవధి నిర్ణయిస్తుంది. గడువు లోపు రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే, ఒకవేళ గడువులోగా ఐటీఆర్ దాఖలు చేయడం కుదరకపోతే రిఫండ్ వస్తుందా? రాదా? అన్న సందిగ్ధతలో ప్రజలు ఉన్నారు.
ఇటీవల కేంద్ర సర్కారు పార్లమెంట్‌లో నూతన ఐటీ బిల్లును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీనిపై చాలా మందికి ఎన్నో డౌట్లు వస్తున్నాయి. అందులో గడువులోగా ఐటీఆర్ దాఖలు చేయడం కుదరకపోతే రిఫండ్ వస్తుందా? రాదా? అన్న డౌటు రిటర్నులు దాఖలు చేసే వారిని వేధిస్తోంది.
ఈ విషయం ఐటీ శాఖ దృష్టికి వెళ్లడంతో దీనిపై క్లారిటీ ఇచ్చింది. రిఫండ్లను పొందే అంశంలో ఎటువంటి అడ్డంకులూ లేవని చెప్పింది. వ్యక్తిగత ఆదాయపు పన్నును చెల్లించేవారు ప్రతి ఏడాది జూలై 31లోపు ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఆ లోపు కుదరకపోతే ఫైన్‌తో డిసెంబర్ 31 వరకు ఐటీఆర్ దాఖలు చేసుకోవచ్చు.
Also Read: జస్ట్ 5 లక్షల్లోపు వచ్చే 4 ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. అందరి దృష్టీ వీటిపైనే.. మీరూ కొంటారా?
నూతన ఐటీ బిల్లులో రిఫండ్లలో ఎటువంటి నిబంధనలనూ మార్చలేదని చెప్పింది. ఆలస్యంగా ఐటీఆర్ దాఖలు చేసినప్పటికీ రిఫండ్ పొందవచ్చని క్లారిటీ ఇచ్చింది. కాగా, నూత ఐటీ బిల్లుకు ఆమోద ముద్ర పడితే 2026-27 ఆర్థిక ఏడాది నుంచి అమల్లోకి వస్తుంది.
ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం, చాప్టర్ XIX కింద రిఫండ్ క్లెయిమ్స్ చేసుకునే పన్ను చెల్లింపుదారులు సెక్షన్ 239 కింద ఆదాయాన్ని రిఫండ్ చేయాలని ఐటీ విభాగం చెబుతోంది.
ఈ నిబంధనను ఇప్పుడు బిల్లు సెక్షన్ 263 (1) (IX)లో చేర్చారు. ఈ బిల్లులోని క్లాజ్ 263 (1)(ఏ)(ix) కింద గడువులోగా ఐటీఆర్ ఫైల్ చేస్తేనే రిఫండ్ కోరగలడని చెబుతోందని కొందరు అంటున్నారు. లేటుగా ఫైల్ చేసినప్పటికీ రిఫండ్‌కు అర్హుడని అంటున్నారు.