Best Cars: జస్ట్ 5 లక్షల్లోపు వచ్చే 4 ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. అందరి దృష్టీ వీటిపైనే.. మీరూ కొంటారా?
దాదాపు రూ.5 లక్షలు పెడితే మంచి కారును మీ సొంతం చేసుకోవచ్చు.

ప్రస్తుత కాలంలో ఈవీలపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వం కూడా ఈవీలను ప్రోత్సహిస్తోంది. తక్కువ ధరకు వచ్చే ఈవీలను కొనాలని మధ్య తరగతి ప్రజలు భావిస్తున్నారు.
బైకులపై ప్రయాణిస్తూ అలసిపోతున్నారా? తక్కువ బడ్జెట్‌లో కారు కొనాలనుకుంటున్నారా? తక్కువ బడ్జెట్‌లో వచ్చే నాలుగు బెస్ట్ ఈవీ కార్ల గురించి తెలుసుకుందాం. దాదాపు రూ.5 లక్షలు పెడితే మంచి కారును మీ సొంతం చేసుకోవచ్చు.
భారతీయ మార్కెట్లో రూ.5 లక్షల లోపు ధరకు వచ్చే మంచి ఈవీ కార్లు ఉన్నాయి. వాటిలో ఉత్తమ బ్రాండ్లుగా టాటా టియాగో, రెనాల్ట్ క్విడ్, రెనాల్ట్ క్విడ్, వేవ్ మొబిలిటీ ఎవా, బజాజ్ క్యూట్ పేర్లను చెప్పుకోవచ్చు.
ఈవీ కార్లు.. వాటి ధరలు
టాటా టియాగో: న్యూ ఢిల్లీలో ఈ మోడల్ ధర రూ.5 – 8.45 లక్షల మధ్య ఉంది.
ఫీచర్లు 20.09 కేఎంపీఎల్, 1199 సీసీ, 5 సీటర్
రెనాల్ట్ క్విడ్: న్యూ ఢిల్లీలో ఈ మోడల్ ధర రూ.4.70 – 6.45 లక్షల మధ్య ఉంది.
22.3 కేఎంపీఎల్, 999 సీసీ, 5 సీటర్
వేవ్ మొబిలిటీ ఎవా: న్యూ ఢిల్లీలో ఈ మోడల్ ధర రూ.3.25 – 4.49 లక్షల మధ్య ఉంది.
3సీటర్, 18 కేడబ్ల్యూహెచ్, 20 కి.మీ., 20.11 బీహెచ్‌పీ
బజాజ్ క్యూట్: న్యూ ఢిల్లీలో ఈ మోడల్ ధర రూ.3.61 లక్షలు.
216 సీసీ, 4 సీటర్