pawan kalyan
Jana Sena Avirbhava Sabha : మచిలీపట్నంలో మంగళవారం జనసేన ఆవిర్భావ సభ జరుగనుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారి వారాహి వాహనంలో ఈ సభకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభం కానున్న పవన్ ర్యాలీ సాయంత్రం 5 గంటల వరకు మచిలీపట్నంకు చేరుకోనుంది. విజయవాడ, ఆటో నగర్, తాడిగడప జంక్షన్, పోలంకి, పెరమలూరు జంక్షన్, పామర్రు, గుడివాడ సెంటర్ మీదుగా ర్యాలీగా మచిలీపట్నం సభ ప్రాంగణానికి చేరుకుంటారు.
జనసేన ఆవిర్భావ సభకు వెళ్లే పవన్ కల్యాణ్ డైరీలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. మంగళగిరిలోని పార్టీ కార్యాలయం నుంచి కాకుండా విజయవాడ ఆటో నగర్ నుంచి పవన్ కల్యాణ్ ర్యాలీ ప్రారంభం కానున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ర్యాలీ ప్రారంభ స్థలం మార్పు చేసినట్లు పేర్కొంది. పోలీసుల విజ్ఞప్తి మేరకు ర్యాలీ ప్రారంభ స్థలాన్ని మార్చినట్లు ప్రకటించింది. 2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేయాలని పవన్ డిసైడ్ అయ్యారు.
Janasena : నన్ను ప్యాకేజ్ స్టార్ అన్న సన్నాసిని చెప్పు తీసుకుని కొడతా : పవన్ కళ్యాణ్
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీ యంత్రాంగాన్ని ఎన్నికల కోసం సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని భారీగా జరుపుతున్నారు. ఈ సభా వేదికగా ఆయన కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. మచిలీపట్నంలో జరుగబోయే జనసేన సభ రాబోయే ఎన్నికలకు దిశా నిర్ధేశం చేయనుంది. అయితే పవన్ ఏం ప్రకటన చేస్తారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
అయితే ప్రభుత్వాన్ని గద్దే దించడమే లక్ష్యంగా ఆయన ఒంటరిగా వెళ్తారా? లేదా టీడీపీ, బీజేపీతో కలిసి పయనిస్తారా? అన్నది తెలిసే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. ప్రతిపక్ష ఓటు చీలకుండా ఏం చేయాలన్న దానిపై సమాలోచనలు చేస్తున్నారు. మరోవైపు సభకు పార్టీ శ్రేణులు భారీగా జన సమీకరణ చేస్తున్నాయి. సాయంత్రం సభ ప్రాంగణానికి పవన్ చేరుకోనున్నారు. పవన్ కు గ్రాండ్ గా వెల్ కమ్ చేప్పేందుకు నేతలు ఏర్పాట్లు చేశారు.