Mark Shankar Health Update: మార్క్ శంకర్ హెల్త్ అప్‌డేట్‌.. కోలుకుంటున్న పవన్ చిన్న కుమారుడు.. కానీ, మూడ్రోజులపాటు మాత్రం..

పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై సింగపూర్ లోని ఆస్పత్రి వైద్యులు కీలక విషయాన్ని వెల్లడించారు.

Pawan Kalyan son Mark Shankar health update

Mark Shankar Health Update: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. బాలుడ్ని వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. తాజాగా.. వైద్యులు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై అప్ డేట్ ఇచ్చారు.

Also Read: CM Chandrababu: అమరావతిలో ఇంటి నిర్మాణానికి సీఎం చంద్రబాబు భూమిపూజ.. కాన్వాయ్ ఆపి రైతులను ఆప్యాయంగా పలకరించిన తండ్రీకొడుకులు

పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు సింగపూర్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. అగ్నిప్రమాదం సమయంలో కాళ్లకు కాలిన గాయాలు కావడంతోపాటు ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అత్యవసర వార్డులో ఉంచి చికిత్స అందించారు. కుమారుడి ఆరోగ్య పరిస్థితిపై అక్కడి వైద్యులు, అధికారులతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. తాజాగా వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్క్ కోలుకుంటున్నాడు. ఊపిరితిత్తుల దగ్గర పొగ పట్టేయడం మూలంగా తలెత్తే ఆరోగ్యపరమైన ఇబ్బందులపై పరీక్షలు చేస్తున్నామని తెలియజేశారు.

Also Read: RBI Repo Rate: ఈఎంఐ చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్‌.. మరోసారి రేపో రేటు తగ్గిస్తూ ఆర్బీఐ నిర్ణయం..

భారత కాలమానం ప్రకారం.. బుధవారం ఉదయం అత్యవసర వార్డు నుంచి మార్క్ ను సాధారణ గదికి తరలించారు. అయితే, మరో మూడు రోజులపాటు వైద్యులు పర్యవేక్షణలో పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆస్పత్రి వైద్యులు తెలియజేశారు.

మరోవైపు పవన్ కళ్యాణ్ మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్లారు. నేరుగా ఆస్పత్రికి చేరుకొని తన కుమాడ్ని చూశారు. పవన్ కుమారుడిని పరామర్శించేందుకు మెగాస్టార్ చిరంజీవి దంపతులు కూడా సింగపూర్ చేరుకున్నారు.