Pawan Kalyan: తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చిన పవన్ కల్యాణ్ చిన్న కుమార్తె పలీనా అంజని.. వీడియో వైరల్
పవన్ కల్యాణ్ చిన్న కుమార్తె పలీనా అంజని కొణిదెల తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు. టిటిడి ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు.

Pawan Kalyan with daughters
Pawan Kalyan in tirumala: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుమలలో ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు. శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యిని వినియోగించారని ఆరోపణలు రావడంతో అపచారం జరిగిందంటూ ప్రాయశ్చిత్త దీక్షను పవన్ చేపట్టిన విషయం తెలిసిందే. గత నెల 22న ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టిన పవన్ 11 రోజుల దీక్ష అనంతరం బుధవారం ఉదయం తిరుమలలో దీక్షను విరమించారు. మంగళవారం సాయంత్రం మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమల కొండపైకి పవన్ కల్యాణ్ చేరుకున్నారు. గోవిందనామస్మరణ చేస్తూ 3,550 మెట్లు ఎక్కారు.
తిరుమల కొండపైకి పవన్ కల్యాణ్ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా పవన్ చిన్న కుమార్తె పలీనా అంజని కొణిదెల తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు. టీటీడీ ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. పలీనా అంజని మైనర్ కావడంతో తండ్రిగా పవన్ కల్యాణ్ డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి చిన్న కుమార్తె పలీనా అంజని కొణిదెల తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు. టిటిడి ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. పలీనా అంజని మైనర్ అయినందున తండ్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ పత్రాలపై సంతకాలు చేశారు.… pic.twitter.com/Lg8zUEfl6l
— JanaSena Party (@JanaSenaParty) October 2, 2024