Nadendla: వ్యక్తిగతంగా కొందరు ఎన్నో అవమానాలకు గురిచేస్తున్నా పవన్ ప్రజల కోసం నిలబడ్డారు: నాదెండ్ల
వ్యక్తిగతంగా కొందరు ఎన్నో అవమానాలకు గురిచేస్తున్నా తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రజల కోసం నిలబడ్డారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ చెప్పారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా, ప్రజల పక్షాన నిలిచేలా జనసేన కార్యక్రమాలు నిర్వహించిందని అన్నారు. ఇవాళ ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ... పవన్ కల్యాణ్ తొమ్మిదేళ్ల క్రితం పార్టీని స్థాపించారని గుర్తుచేశారు.

Nadendla Manohar
Nadendla: వ్యక్తిగతంగా కొందరు ఎన్నో అవమానాలకు గురిచేస్తున్నా తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రజల కోసం నిలబడ్డారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ చెప్పారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా, ప్రజల పక్షాన నిలిచేలా జనసేన కార్యక్రమాలు నిర్వహించిందని అన్నారు. ఇవాళ ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ… పవన్ కల్యాణ్ తొమ్మిదేళ్ల క్రితం పార్టీని స్థాపించారని గుర్తుచేశారు. జనసేన నాయకులు, వీర మహిళలు అధినేతకు అండగా నిలిచారని తెలిపారు. ఏ కార్యక్రమానికి పిలుపు ఇచ్చినా స్పందించారని అన్నారు. మార్చి 14 జనసేన ఆవిర్భావ దినోత్సవమని చెప్పారు.
రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేన ముందుకు వెళ్లేలా కార్యాచరణ ఉంటుందని తెలిపారు. పదో ఆవిర్భావ దినోత్సవ సభను మచిలీపట్నంలో నిర్వహిస్తామని చెప్పారు. తుపాన్ సమయంలో పవన్ కల్యాణ్ ఆ ప్రాంతంలో పర్యటించారని తెలిపారు. రైతులను ఆదుకోకుండా జగన్ ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెట్టిందని చెప్పారు. ఆనాడు రైతులకు పవన్ అండగా నిలిచారని తెలిపారు.
మచిలీపట్నం ప్రజలు ముందుకు వచ్చి సభ పెట్టాలని కోరారని పవన్ కల్యాణ్ చెప్పారు. 34 ఎకరాల్లో ప్రత్యేకంగా సభ కోసం ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. భద్రత పరంగా తగిన విధంగా అన్ని జాగ్రత్త లు తీసుకుంటామని చెప్పారు. మహనీయుల గురించి చాటి చెప్పేలా అక్కడ ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. మువ్వెన్నెల జెండా రూపకర్త పింగళి వెంకయ్యను గుర్తు చేసుకుంటామని చెప్పారు. వేదిక పేరును పొట్టి శ్రీరాములు వేదికగా పెడుతున్నామని అన్నారు.
సుభాష్ చంద్రబోస్ ను స్మరించుకుంటామని తెలిపారు. సాయంత్రం జరిగే సభ కు పవన్ 5 గంటలకు వస్తారని చెప్పారు. మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి వారాహి వాహనం లో పవన్ కల్యాణ్ బయలు దేరతారని అన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపే విధంగా జనసేన ప్రణాళిక ఉంటుందని చెప్పారు.
త్వరలోనే మళ్లీ ఈ సభకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ప్రజల కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం పాటుపడుతున్న పవన్ ను ఆదరించాలని కోరారు. వైసీపీ విముక్త ప్రభుత్వాన్ని తీసుకు రావాలని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని పవన్ కల్యాణ్ తరపున తాను కోరుతున్నాని అన్నారు.
BJP Jagtial: బీజేపీలో చేరిన జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్.. సాయంత్రం నద్దాతో భేటీ