AP CID: ఏపీ సీఐడీ ఘనత.. ఇంటర్నేషనల్ సైబర్ క్రైమ్ నెట్ వర్క్ గుట్టు రట్టు.. దేశవ్యాప్తంగా 10వేల కోట్ల మోసం..

హుడే నుంచి 1600 సిమ్ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు. కంబోడియా కేంద్రంగా నేరాలు జరుగుతున్నట్లు సీఐడీ అధికారులు గుర్తించారు.

AP CID: ఏపీ సీఐడీ ఘనత.. ఇంటర్నేషనల్ సైబర్ క్రైమ్ నెట్ వర్క్ గుట్టు రట్టు.. దేశవ్యాప్తంగా 10వేల కోట్ల మోసం..

Updated On : December 26, 2025 / 6:21 PM IST

AP CID: ఇంటర్నేషనల్ సైబర్ క్రైమ్ నెట్ వర్క్ ను ఛేదించింది ఏపీ సీఐడీ. కంబోడియా నుంచి సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసింది. ఈ ముఠా దేశవ్యాప్తంగా 10వేల కోట్ల వరకు మోసం చేసినట్లు అధికారులు తెలిపారు. ఒక్క ఏపీలోనే 20 కోట్ల వరకు మోసం చేసినట్లు స్పష్టం చేశారు. డైరెక్టరేట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్ సహకారంతో భారీ క్రైమ్ నెట్ వర్క్ ను ఏపీ సీఐడీ ఛేదించింది.

వియత్నాంకు చెందిన హుడేను వెస్ట్ బెంగాల్ లో అరెస్ట్ చేసింది. హుడే నుంచి 1600 సిమ్ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు. కంబోడియా కేంద్రంగా నేరాలు జరుగుతున్నట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. కంబోడియాలో కాల్ సెంటర్లు ఏర్పాటు చేసిన నిందితులు విశాఖతో పాటు వెస్ట్ బెంగాల్, ఒడిశాలో సిమ్ బాక్స్ కేంద్రాలకు అనుసంధానం చేసినట్లు గుర్తించారు. వీటి ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. నెట్ వర్క్ కార్డ్స్ కు సర్వర్లు, సిమ్ కార్డులు ఎక్కడి నుంచి పని చేస్తున్నాయనే విషయాలను ఆరా తీశారు. ఇతరుల ధృవపత్రాలతో భారీగా మ్యూల్ సిమ్ కార్డులు తీసుకుని సిమ్ బాక్స్ లను ఏర్పాటు చేసినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు.

Also Read: బిగ్ అలర్ట్.. 2026 జనవరి 1 నుంచి రాబోయే అతిపెద్ద మార్పులివే.. పాన్-ఆధార్ నుంచి LPG గ్యాస్ వరకు కొత్త రూల్స్..!

ఈ ఆపరేషన్ కు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు ఏపీ సీఐడీ డీఎస్పీ రవి శంకర్. ఆపరేషన్ ఎలా స్టార్ట్ చేశారు, ఎవరెవరి సహకారం తీసుకున్నారు, ఎక్కడెక్కడికి వెళ్లి రైడ్స్ చేశారు అనే వివరాలు తెలిపారు. ”డైరెక్టరేట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్ నుంచి ఇన్ పుట్ వచ్చింది. ఆ డిపార్ట్ మెంట్ అనాలసిస్ ను బట్టి ముందుకెళ్లాం. డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ కి సంచార్ సాథీ యాప్ ఉంటుంది. అందులో సైబర్ క్రైమ్ బాధితులు ఫిర్యాదులు నమోదు చేయొచ్చు. కాల్స్ వచ్చిన నెంబర్లను ఐడెంటిఫై చేసి వాటి మీద అనాలసిస్ చేశాం. రైడ్స్ చేశాం. సిమ్ బాక్స్ ను గుర్తించాం. వాళ్లు ఎలా తెస్తున్నారో తెలుసుకున్నాం.

ఈ బాక్స్ చూసేందుకు పవర్ అంప్లిఫయర్ లా ఉంటుంది. కానీ ఇది సిమ్ బాక్స్. పవర్ యాంప్లిఫయ్యర్ అనుకునేలా చేసి విదేశాల నుంచి భారత్ కు తీసుకొస్తున్నారు. రైడ్ చేసిన సమయంలో ఇలా తెస్తున్నారని తెలుసుకున్నాం. కస్టమ్స్ డిపార్ట్ మెంట్ తో కలిసి పని చేశాం. ఎక్కడి నుంచి, ఎలా వస్తుందో వెరిఫై చేశాం. అంతా అనాలసిస్ చేసుకున్నాం. టీమ్స్ గా వెళ్లి రైడ్స్ చేశాం. 14 సిమ్ బాక్సులను రికవర్ చేశాం. అందులో మాకు బోలెడు సిమ్ కార్డులు దొరికాయి. అన్ని టెలికాం నెట్ వర్క్ ఆపరేటర్లకు చెందిన 1600కు పైగా సిమ్ కార్డ్స్ సీజ్ చేశాం” అని ఏపీ సీఐడీ డీఎస్పీ రవి శంకర్ తెలిపారు.