Penna River Bridge : కుంగిన పెన్నా నది బ్రిడ్జి..రాకపోకలు నిలిపివేత

భారీ వర్షాలు, వరదలతో కడప జిల్లాలో జమ్మలమడుగు పెన్నా నది బ్రిడ్జి కుంగింది. జమ్మలమడుగు - ముద్దనూరు రోడ్ బ్రిడ్జి కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం రాకపోకలు నిలిపి వేశారు.

Penna River Bridge shrunked : భారీ వర్షాలు, వరదలతో కడప జిల్లాలో జమ్మలమడుగు పెన్నా నది బ్రిడ్జి కుంగింది. జమ్మలమడుగు – ముద్దనూరు రోడ్ బ్రిడ్జి కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం పోలీసులు రాకపోకలు నిలిపి వేశారు. బ్రిడ్జి మధ్య భాగం కుంగిపోతుంది. జమ్మలమడుగు.. ముద్దనూరు.. పులివెందుల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. వైఎస్ రాజశేఖరెడ్డి మొదటిసారి సీఎం అయిన తరువాత ఈ బ్రిడ్జి వేశారు.

వారం రోజులుగా మైలవరం నుంచి భారీగా వరద రావడంతో బ్రిడ్జి కుంగుతున్నట్లు ఉన్నట్లు తెలుస్తోంది. జమ్మలమడుగు పెన్నానదిపై బిడ్జిపై భారీ వాహనాలు తిరుగుతుండేవి. జమ్మలమడుగు పెన్నానదిపై దాల్మియా సిమెంట్ లారీలు, ధర్మల్ సిమెంట్ లారీలతో పాటు భారీ వాహనాలు తిరిగేవి.

Nellore Trains : దెబ్బతిన్న రైల్వే ట్రాక్, సాహసోపేత ప్రయాణం చేసిన ప్రయాణీకులు

ఏపీలో కురిసిన భారీ వర్షాలకు ఇప్పటివరకు రాష్ట్రంలో 24 మంది చనిపోయారు. 17 మంది గల్లంతైనట్లు ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించింది. అయితే.. అనధికారికంగా 50 మంది దాకా ఆచూకీ తెలియడం లేదని.. స్థానికులు చెబుతున్నారు. కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లోని.. 172 మండలాలపై వర్షం తన ప్రతాపమేంటో చూపించింది.

ప్రాథమిక అంచనాల ప్రకారం 4 జిల్లాల్లో కలిపి సుమారు 6 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. భారీ వర్షాలకు 28 చెరువులు, కుంటలు, కాలువలు తెగిపోయాయి. 188 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. ఒక్క కడప జిల్లాలోనే మూడున్నర వేల పశువులు ప్రాణాలు కోల్పోయాయి.

Kerala : బలవంతపెట్టి లైంగిక సంబంధం పెట్టుకుంటే అత్యాచారమే..కేరళ హైకోర్టు కీలక తీర్పు

ఎడతెరపిలేని వర్షాలతో 1,316 గ్రామాలను వరద ముంచెత్తింది. కడప జిల్లాలో అత్యధికంగా 866 గ్రామాలు నీటమునిగినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వర్షాలు, వరదల కారణంగా 15 వందల 50 ఇళ్లు దెబతిన్నాయి. కడప జిల్లాలోనే అత్యధికంగా 792 ఇళ్లు వర్షాలకు ధ్వంసమైపోయాయి. వర్షాలు తగ్గాక.. కనిపిస్తున్న దృశ్యాలు అందరినీ కలచివేస్తున్నాయి. కడప జిల్లా రాజంపేట మండలంలో.. ఊళ్లకు ఊళ్లే తుడిచిపెట్టుకుపోయాయి.

ట్రెండింగ్ వార్తలు