Perni Nani : బావని కాపాడేందుకు బావమరిదికి మరో అవకాశం.. బాలయ్య, పవన్ షో పై పేర్నినాని హాట్ కామెంట్స్
ఈ షో ద్వారా బాలకృష్ణకు తన బావ చంద్రబాబును కాపాడే మరో అవకాశం దొరికిందన్నారు పేర్నినాని. బావ తప్పులను బాలకృష్ణ సరి చేస్తున్నారని పేర్నినాని సెటైర్ వేశారు.

Perni Nani : నందమూరి నటసింహం బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. అన్ స్టాపబుల్ షో కోసం కలిసిన సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి షూటింగ్ లో పాల్గొన్నారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈ షో సినీ వర్గాల్లోనే కాదు రాజకీయవర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. బాలయ్య, పవన్ షో.. పొలిటికల్ యాంగిల్ కూడా తీసుకుంది.
బాలకృష్ణ, పవన్ షో పై వైసీపీ నేత, మాజీమంత్రి పేర్నినాని హాట్ కామెంట్స్ చేశారు. ఈ షో ద్వారా బాలకృష్ణకు తన బావ చంద్రబాబును కాపాడే మరో అవకాశం దొరికిందన్నారు పేర్నినాని. బావ తప్పులను బాలకృష్ణ సరి చేస్తున్నారని పేర్నినాని సెటైర్ వేశారు.
ఎన్టీఆర్ నుంచి ఔరంగజేబులా బాలకృష్ణ కుటుంబానికి అధికారం వచ్చిందన్న పేర్నినాని.. చంద్రబాబుకి అనుకూలంగా ఉన్న పార్టీలను బాలయ్య పోగేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసే తిరుగుతున్నారన్న పేర్నినాని.. బావతో తిరిగినప్పుడు బావమరిదితో తిరిగితే తప్పేంటని ప్రశ్నించారు. ఈ షో వల్ల బాలకృష్ణ, పవన్ కల్యాణ్ ఇద్దరికీ డబ్బులు వస్తాయన్నారు పేర్నినాని.
Also Read..Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’పై ప్రొడ్యూసర్ కామెంట్స్.. ఏమన్నాడంటే?
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా(Aha) వేదికగా బాలయ్య అన్ స్టాపబుల్ సెకండ్ సీజన్ సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ షోకు టాలీవుడ్ కి చెందిన పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు. అన్ స్టాపబుల్ షో.. దేశంలోనే టాప్ రేంజ్ కు వెళ్లింది. తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ షో కి రావడం.. ఈ షో ని నెక్ట్స్ లెవెల్ కి తీసుకెళ్లింది.