Janasena Office : జనసేన ఆఫీసుపై దాడి.. రాడ్డు తీసుకొని వచ్చి కార్లు ధ్వంసం.. పోలీసుల ఎంట్రీతో..
Janasena Office : గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలోకి గుర్తుతెలియని వ్యక్తి ప్రవేశించి దాడికి పాల్పడ్డాడు.
- Harishth Thanniru
- Published On : February 27, 2026 / 02:42 PM IST
Janasena Office
Janasena Office : గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలోకి గుర్తుతెలియని వ్యక్తి ప్రవేశించి దాడికి పాల్పడ్డాడు. రాడ్డు తీసుకొని వచ్చి కార్యాలయంలోని రెండు కార్లను ధ్వంసం చేశాడు. సమాచారం అందుకున్న మంగళగిరి పట్టణ పోలీసులు హుటాహుటీన పార్టీ కార్యాలయం వద్దకు చేరుకొని కార్లను ధ్వంసం చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.
Also Read : Botsa Satyanarayana : వైసీపీ నేత బొత్స సత్యనారాయణకు అస్వస్థత.. హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స
మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో అతన్ని విచారిస్తున్నారు. ఐజీ సర్వ శ్రేష్టి త్రిపాటి, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పోలీస్ స్టేషన్ కు చేరుకొని అతన్ని విచారించారు. అతను ఎవరు.. ఎందుకోసం ఇలా చేశాడు.. దీని వెనుక ఏమైనా రాజకీయ కుట్రకోణం ఉందా.. అనే విషయాలపై ఆరా తీశారు. పోలీసుల విచారణ అనంతరం.. మంగళగిరి జనసేన పార్టీలో కారు అద్దాలు పగలగొట్టిన వ్యక్తిని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంకు చెందిన నారంనీలాద్రికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. విచారణ అనంతరం ఐసీ, ఎస్పీలు పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోయారు.
