Pill in High Court: హైకోర్టులో పిల్.. ఉద్యోగుల సమ్మె రాజ్యాంగ విరుద్ధం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీఆర్సీపై ఇచ్చిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ ఉద్యోగ సంఘాలు చేయబూనిన సమ్మెను..

Pill in High Court: హైకోర్టులో పిల్.. ఉద్యోగుల సమ్మె రాజ్యాంగ విరుద్ధం

Ap High Court

Updated On : January 29, 2022 / 11:41 AM IST

Pill in High Court: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీఆర్సీపై ఇచ్చిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ ఉద్యోగ సంఘాలు చేయబూనిన సమ్మెను.. ఉద్యోగస్తులు సీఎస్‌కు ఇచ్చిన సమ్మె నోటీసుని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. విశాఖకు చెందిన రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ నాదెండ్ల సాంబశివరావు హైకోర్టులో ఈమేరకు పిల్‌ వేశారు.

ఉద్యోగ సంఘాలు ఇచ్చిన సమ్మె నోటీసును రాజ్యాంగ, చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని అభ్యర్ధిస్తూ హైకోర్టు మెట్లెక్కారు సాంబశివరావు. ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేయడం సర్వీసు నిబంధనలకు విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినట్లు పిల్‍‌లో ప్రస్తావించారు.

ఉద్యోగులు సమ్మెకు వెళ్తే.. సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని, ఉద్యోగుల ఉద్యమంతో కోవిడ్‌ వ్యాప్తి పెరిగే ప్రమాదం కూడా ఉందని అభిప్రాయపడ్డారు.

సమ్మె నోటీసును రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరిన సాంబశివరావు సమ్మెకు వెళ్లకుండా ఉద్యోగులను ఆదేశించాలని కోరారు. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ఉద్యోగస్తులు సమ్మెకు వెళ్లనున్నారు.