Kandukur Incident: కందుకూరు ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన

కందుకూరు తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ దుర్ఘటనతో తీవ్రంగా కలత చెందినట్లు తెలిపారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది.

PM Modi

Kandukur Incident: నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించగా, పలువురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కందుకూరు తొక్కిసలాట ఘటన విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ దుర్ఘటనతో తీవ్రంగా కలత చెందినట్లు తెలిపారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు.

Kandukur Accident: చంద్రబాబు సభలో తోపులాట.. ఏడుగురి మృతి.. మరో ఏడుగురికి తీవ్రగాయాలు

మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ప్రధాన మంత్రి జాతీయ సహాయనిధి నుంచి రూ. 2లక్షలు, గాయపడిన వారికి రూ. 50వేల చొప్పున ఎక్స్ గ్రేషియాను అందజేస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు.

 

కందుకూరు తొక్కిసలాట ఘటనలో మృతులకు ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో పోస్టమార్టం పూర్తయింది. అనంతరం మృతదేహాలను ఎనిమిది అంబులెన్స్‌ల ద్వారా స్వస్థలాలకు తరలించనున్నారు. మృతులకు టీడీపీ తరపున అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం కందుకూరులోనే చంద్రబాబు ఉన్నారు.