Polavaram: పోలవరం డయాఫ్రమ్ వాల్ పనులు నిలిపివేత.. ఎందుకంటే..?

పోలవరం డయాఫ్రమ్ వాల్ పనుల్లో సందిగ్దత నెలకొంది. ఈనెల 18న ప్రత్యేక పూజలు నిర్వహించి డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను అధికారులు ప్రారంభించారు. అయితే..

Polavaram: పోలవరం డయాఫ్రమ్ వాల్ పనులు నిలిపివేత.. ఎందుకంటే..?

Polavaram Diaphragm Wall

Updated On : January 20, 2025 / 2:05 PM IST

Polavaram: పోలవరం ప్రాజెక్ట్ డయాఫ్రమ్ వాల్ పనుల్లో సందిగ్దత నెలకొంది. ఈనెల 18న ప్రత్యేక పూజలు నిర్వహించి డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను అధికారులు ప్రారంభించారు. అయితే, టీ5-కాంక్రీట్ మిశ్రమంతో ప్రారంభించిన పనులు నిలుపుదల చేయాలని కేంద్ర జల సంఘం ఆదేశాలు జారీ చేసింది. టీ16-కాంక్రీట్ మిశ్రమంతో పనులు చేయాలని అంతర్జాతీయ నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు వెళ్లారు. అక్కడేఉన్న కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో చర్చలు జరపనున్నారు. అయితే, ఇవాళ సీడబ్ల్యూసీ, సీఎస్ఎంఆర్ఎస్ అధికారులు చర్చలు జరపనున్నారు. ఈ చర్చల తరువాత ఇవాళ పనులు నిర్వహించడంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Also Read: Davos Tour: జ్యూరిచ్ విమానాశ్రయంలో కలుసుకున్న చంద్రబాబు, రేవంత్ రెడ్డి.. ఫొటో వైరల్

గతంలో టీ5-కాంక్రీట్ మిశ్రమంతో చేసిన నిర్మాణం వరదల కారణంగా దెబ్బతినడంతో మళ్లీ కొత్తగా డయాఫ్రమ్ వాల్ ను నిర్మిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ అదే కాంట్రాక్ట్ సంస్థ అదే టీ5-కాంక్రీట్ మిశ్రమాన్ని వినియోగించి పనులు నిర్వహిస్తుంది. తాజాగా ఈ పనుల నిర్వహణపై సందిగ్దత నెలకొంది. అయితే, డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో కాంక్రీట్ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ప్రస్తుతం మట్టి పూడిక తీసే పనులు మాత్రమే కొనసాగుతున్నాయి. సిడబ్ల్యూసీ, సీఎస్ఎంఆర్ఎస్ అధికారుల చర్చల తరువాత డయాఫ్రమ్ వాల్ పనులు నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.