తాడిపత్రి పట్టణంలో 144 సెక్షన్.. పని మనుషులకోసం స్టేషన్‌కు వెళ్లిన జేసీ దివాకర్ రెడ్డి

తాడిపత్రి పట్టణంలో పోలీసులు 144 సెక్షన్ అమల్లోకి తీసుకొచ్చారు. పోలీస్ బలగాల పహారాలో తాడిపత్రి పట్టణం ఉంది.

తాడిపత్రి పట్టణంలో 144 సెక్షన్.. పని మనుషులకోసం స్టేషన్‌కు వెళ్లిన జేసీ దివాకర్ రెడ్డి

High Tension in Tadipatri

Tadpatri Constituency : ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈవీఎంలను అధికారులు స్ట్రాంగ్ రూంలలో భద్రపర్చారు. అయితే, పోలింగ్ సమయంలో తలెత్తిన ఘర్షణలు పలు ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతున్నాయి. తాడేపల్లి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో తాడిపత్రి పట్టణంలో పోలీసులు 144 సెక్షన్ అమల్లోకి తీసుకొచ్చారు. పోలీస్ బలగాల పహారాలోతో పట్టణంలోని వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి.

Also Read : Cm Revanth Reddy : ఏపీలో షర్మిల గెలుస్తుంది..! ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరైనా సరే- ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు

తాడిపత్రి పట్టణంలో గుంపులు గుంపులుగా ఉండొద్దంటూ ప్రజలకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ దగ్గరుండి పరిస్థితిని పర్యవేక్షిస్తూ తాడిపత్రిలోని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అర్ధరాత్రి సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, అతని కుమారుడ్ని, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, అతని కుమారుడ్ని పోలీసులు ఇతర ప్రాంతాలకు తరలించారు. రాళ్లు రువ్వడానికి సిద్ధంగా ఏర్పాటు చేసుకున్న రాళ్లను అనంతపురం ఆర్డీవో వెంకటేశులు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు తొలగించారు. ఇదిలాఉంటే మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తాడిపత్రి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. తన ఇంటిలో పని మనుషులను పంపించాలని పోలీసులను కోరారు.

Also Read : గెలుపోటములపై పార్టీలు, నేతల లెక్కలు.. ఎన్నికలు ముగిశాయ్.. ఇప్పుడు ఏం జరుగుతోందో తెలుసా?

తన ఇంట్లో పనిమనుషులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తాడిపత్రి టౌన్ స్టేషన్ లో డీఎస్పీ గంగయ్య దృష్టికి జేసీ దివాకర్ రెడ్డి తీసుకెళ్లారు. ఇంట్లో మేమిద్దరం ఫేసెంట్లమని, సమయానికి ఆహారం, మందులు అందిచేవారులేక ఇబ్బంది పడుతున్నామని, పనివాళ్లను తీసుకెళ్లడానికి స్టేషన్ కు వచ్చానని డీఎస్పీకి దివాకర్ రెడ్డి తెలిపారు. సమస్యను పైఅధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని డీఎస్పీ రంగయ్య తెలపడంతో స్టేషన్ నుంచి జేసీ దివాకర్ రెడ్డి వెళ్లిపోయారు.