Perni Nani: రేషన్ బియ్యం ఉచ్చు పేర్నినానికే పరిమితం కాలేదా?

మొదట గోదాములో 3వేల బస్తాలు కనిపించడం లేదనుకున్నారు. చివరికి 7 వేలకు పైగా బస్తాలు లేవని తేల్చారు.

Perni Nani

కూటమి ప్రభుత్వం ఆరోపించింది నిజమేనా? ఇన్నాళ్లు కాకినాడ పోర్ట్‌.. సీజ్‌ ది షిప్ అంటూ మాత్రమే హడావుడి నడిచింది. కానీ గోదాముల నుంచే బియ్యం బస్తాలు మాయమైన కథ బయటపడింది. మాజీమంత్రి పేర్నినాని చుట్టూ ఉచ్చు బిగిసినట్లే కనిపిస్తోంది. పేర్ని కుటుంబానికి చెందిన గోదాముల్లో నిల్వ ఉంచిన..రేష‌న్ బియ్యంలో దాదాపు 7వేల 5వందల బస్తాలు మాయమైనట్లు గుర్తించారట అధికారులు.

ఈ క్రమంలో రేషన్ బియ్యం మాయం కేసులో ఏ1గా ఉన్న పేర్ని నాని భార్య జయసుధ ఉండగా.. ఏ2గా గోడౌన్ మేనేజర్ మానస తేజను చేర్చారు పోలీసులు. గోడౌన్ నుంచి MLS పాయింట్స్‌కు పీడీఎస్ బియ్యం రవాణా చేస్తున్నట్టు గుర్తించారట. ఇక ఏ6 గా పేర్ని నాని పేరు చేర్చారు పోలీసులు. ఈ కేసులో పేర్నినాని సతీమణి జయసుధ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఇప్పుడు నాని కూడా హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు.

వైసీపీనే ఎక్కువగా బ‌ద్నాం అయ్యిందా?
ఈ మొత్తం ఎపిసోడ్‌లో పేర్ని కుంటుంబం కంటే కూడా వైసీపీ పార్టీనే ఎక్కువగా బ‌ద్నాం అయిందన్న టాక్ వినిపిస్తోంది. అపోజిషన్‌లోకి వచ్చాక పార్టీ తరఫున తెల్లారి లేస్తే వాయిస్ వినిపిస్తున్న వాళ్లల్లో పేర్నినాని ముందుంటున్నారు. ఈ క్రమంలో ఆయనే స్కామ్‌లో ఇరుక్కోవడంతో నానితో పాటు..వైసీపీ అక్రమాల భాగోతం బయటపడినట్లు అయిందంటున్నారు టీడీపీ నేతలు. బియ్యం మాయమైనట్లు ఒప్పుకుని ఫైన్ కట్టారంటేనే పేర్నినాని తప్పు చేశారని తేలిపోయిందని..ఇంకా బుకాయించడం ఎందుకని ప్రశ్నిస్తోంది టీడీపీ.

ఈ క్రమంలోనే పేర్నినాని వాయిస్ డల్ అయిపోయింది. తన ఏరియా మంత్రి ఒకరు కుట్ర చేస్తున్నారంటూ మాట్లాడుతున్నారే తప్ప..కూటమి ప్రభుత్వం మీద అటాక్ చేయడం లేదు. తన చంద్రబాబుతో రాజకీయ వైరం ఉన్నా..సీఎం తన భార్యను అరెస్ట్‌ చేయకుండా..అడ్డుకున్నారంటూ పొగడ్తలు కురిపించారు. ఇలా మీడియా ముందుకు వస్తే మాటల ప్రవాహంతో దూసుకుని పోయే పేర్నినాని చల్లడిపోయినట్లు కనిపిస్తోంది. ఆయన ప్రెస్‌మీట్‌లో కూడా మాటలలో విరుపులు..విమర్శలు..వెటకారాలు లేకుండాపోయాయి.

వైసీపీ హయాంలో జయసుధ పేరిట గోదామును నిర్మించారు పేర్నినాని. దాన్ని పౌరసరఫరాల శాఖకు అద్దెకు ఇచ్చారు. ఆ గిడ్డంగిని ఈ మధ్యే అధికారులు తనిఖీ చేసి..బియ్యం నిల్వల్లో తేడాలు ఉన్నట్లు గుర్తించారు. పెద్దఎత్తున పీడీఎస్‌ బియ్యం మాయమైనట్లు తేల్చారు.

లక్షల మేర లావాదేవీలు
గోదాము మేనేజర్‌ మానస్‌తేజ, పౌరసరఫరాల అధికారి కోటిరెడ్డి మిగిలిన ఇద్దరి బ్యాంకు ఖాతాల లావాదేవీల్లో దాదాపు రూ.25 లక్షల నుంచి రూ.30లక్షల మేర లావాదేవీలు జరిగాయని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. పేర్ని నాని కుటుంబంలోని పలువురి ఖాతాలకు కూడా మానస్‌తేజ ఖాతా నుంచి డబ్బు లక్షల్లో లావాదేవీలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అయితే తమ గోదాముల్లో బియ్యం నిల్లలు కొంత తగ్గాయని, అందుకు లెక్కగట్టి చెబితే డబ్బులు చెల్లిస్తామని పేర్ని జయసుధకు చెందిన గోదాము నుంచి సివిల్ సప్లై శాఖకు లేఖ రాశారు. మొదట గోదాములో 3వేల బస్తాలు కనిపించడం లేదనుకున్నారు. చివరికి 7 వేలకు పైగా బస్తాలు లేవని తేల్చారు. దీంతో మిస్సింగ్ బియ్యానికి జరిమానాతో కలిపి రూ. కోటి 74 లక్షలకుపైగా చెల్లించారు. కానీ తప్పు చేసి డబ్బులు చెల్లించడం సరిదకాదని పోలీసులు చర్య తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పేర్నినాని పరారీలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి ఈ కేసు ఇంకెంత దూరం వెళ్తందో..

CM Revanth Reddy: చంద్రబాబు రిక్వెస్ట్‌కు రేవంత్‌ రెడ్డి ఓకే చెబుతారా?