CM Revanth Reddy: చంద్రబాబు రిక్వెస్ట్‌కు రేవంత్‌ రెడ్డి ఓకే చెబుతారా?

రెండు రాష్ట్రాల మధ్య పెద్దఎత్తున విభజన వివాదాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహానికి భూమి కేటాయిస్తే కచ్చితంగా వ్యతిరేకత వ్యక్తమవుతుందని భావిస్తున్నారట.

CM Revanth Reddy: చంద్రబాబు రిక్వెస్ట్‌కు రేవంత్‌ రెడ్డి ఓకే చెబుతారా?

Updated On : January 1, 2025 / 8:32 PM IST

ఏపీ, తెలంగాణ. రాష్ట్రాలుగా విడిపోయి పదేళ్లు అయినా..రెండు రాష్ట్రాల మధ్య ఏదో ఒక ఇష్యూ ఉండనే ఉంటుంది. వివాదాలు..చర్చలు..పరిష్కారాలు రెగ్యులర్‌ అయిపోయాయి. ఈ క్రమంలోనే తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించిన తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలు అనుమతించకపోవడం కొన్ని రోజులుగా కొనసాగుతోన్న వివాదానికి ఎండ్‌కార్డ్‌ పడింది.

తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను అనుమతించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. శ్రీవారి దర్శనాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి, ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. తెలుగు జాతి సత్సంబంధాల కోసం అనుమతులు మంజూరు చేయుటకు ఆదేశాలు ఇచ్చామని చంద్రబాబు స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి మేరకు తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధులు సిఫార్సులు వారానికి రెండుసార్లు అనుమతిస్తామని చెప్పారు.

రేవంత్‌ రిక్వెస్ట్‌తో సిఫార్సు లేఖకు చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అయితే తెలంగాణ సర్కార్ విజ్ఞప్తిని ఏపీ ప్రభుత్వం మన్నించిన నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు పెట్టిన ప్రతిపాదనపై రేవంత్‌ ఏ నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తి కొనసాగుతోంది. హైదరాబాద్‌లో 100 అడుగుల ఎత్తుతో దివంగత నేత ఎన్టీఆర్‌ విగ్రహాన్ని పెట్టడానికి, ఎన్టీఆర్‌ నాలెడ్జి సెంటర్‌ ఏర్పాటుకు భూమి ఇవ్వాలని కోరారు ఏపీ సీఎం చంద్రబాబు.

సీఎం రేవంత్ రెడ్డి సానుకూలం?
ఈ మేరకు ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ కుమారుడు మోహనకృష్ణ తదితరులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు వెళ్లి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌ ఓఆర్ఆర్ దగ్గరలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు, నందమూరి తారక రామారావు వంద అడుగుల విగ్రహం ప్రతిష్టాపనకు, ఎన్టీఆర్‌ నాలెడ్జ్‌ సెంటర్‌ ఏర్పాటుకు 10 ఎకరాల భూమి కావాలని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు.

హైదరాబాద్‌లో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు భూమి ఇవ్వడానికి సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారన్న చర్చ జరుగుతోంది. అయితే అధికారికంగా నిర్ణయం తీసుకోలేదు. ఔటర్ రింగ్ రోడ్డు పక్కన ఎన్టీఆర్ 100 అడుగుల విగ్రహం, నాలెడ్జ్ సెంటర్ కోసం 10 ఎకరాల భూమి కేటాయిస్తే ప్రతిపక్షాలతో పాటు సొంత పార్టీ నుంచి ఎలాంటి స్పందన వస్తుందోనన్న సందిగ్ధంలో రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది.

రెండు రాష్ట్రాల మధ్య పెద్దఎత్తున విభజన వివాదాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహానికి భూమి కేటాయిస్తే కచ్చితంగా వ్యతిరేకత వ్యక్తమవుతుందని భావిస్తున్నారట. కానీ శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలకు అనుమతిచ్చిన నేపథ్యంలో..ఎన్టీఆర్ విగ్రహానికి భూమి విషయంలో సీఎం రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది. చూడాలి మరి తెలంగాణ సర్కార్..సీఎం రేవంత్‌ డెసిషన్ ఎలా ఉంటుందో.

Perni Jayasudha : బియ్యం మాయం కేసులో ముగిసిన పేర్ని జయసుధ విచారణ.. పోలీసులు ఎంత సేపు విచారించారంటే..