Nara Lokesh Padayatra : లోకేశ్ యువగళం పాదయాత్ర.. పోలీసులు పెట్టిన 15 కండిషన్లు ఇవే

లోకేశ్ యువగళం పాదయాత్రకు మొత్తం 15 కండీషన్ల పెట్టామన్నారు పోలీసులు. వీటిలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి. పాదయాత్రకు తమ వైపు నుంచి పూర్తిగా భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు.

Nara Lokesh Padayatra : టీడీపీ నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రపై వారం రోజులుగా ఆ పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామన్నారు చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి. పాదయాత్రకు మొత్తం 15 కండీషన్ల పెట్టామన్నారు. వీటిలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు ఎస్పీ రిశాంత్ రెడ్డి. పాదయాత్రకు తమ వైపు నుంచి పూర్తిగా భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు ఎస్పీ రిశాంత్ రెడ్డి. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే లోకేశ్ పాదయాత్రకు అనుమతిని ఇచ్చామని చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి తెలిపారు.

పాదయాత్రకు పోలీసుల షరతులివే..
* పాదయాత్ర సందర్భంగా ప్రజలకు, వాహనదారులకు, ఎమర్జెన్సీ సర్వీసెస్ రాకపోకలకు ఆటంకాలు కలిగించకూడదు.
* ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నష్టం వాటిల్లకుండా చూసుకోవాలి.
* టపాసులను పేల్చడం నిషిద్ధం.
* సమయాలకు కట్టుబడి బహిరంగసభలను నిర్వహించుకోవాలి.
* సమావేశ స్థలాల్లో ప్రథమ చికిత్స, వైద్య పరికరాలతో అంబులెన్సులను నిర్వాహకులు ఏర్పాటు చేసుకోవాలి.
* ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి అగ్నిమాపక యంత్రాన్ని కూడా ఉంచాలి.
* విధుల్లో ఉన్న పోలీసులు ఎప్పటికప్పుడు ఇచ్చే ఆదేశాలను పాటించాలి.
* రోడ్లపై సమావేశాలను నిర్వహించకూడదు.

ఇవీ నారా లోకేశ్ పాదయాత్రకు పోలీసుల పెట్టిన షరతులు. అయితే, ఈ షరతులపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

లోకేశ్ యువగళం పాదయాత్ర..
* రేపు ఎన్టీఆర్ ఘాట్ లో నివాళి అర్పించి ఏపీకి పయనం
* రేపు సాయంత్రం 5.15కి కడప చేరుకోనున్న లోకేశ్
* కడప అమీన్ పీర్ దర్గాను సందర్శించనున్న లోకేశ్
* అనంతరం కడప కేథలిక్ చర్చిలో లోకేశ్ ప్రార్థనలు
* ఎల్లుండి తిరుమల శ్రీవారి దర్శనం
* తర్వాత తిరుమల నుంచి కుప్పం పయనం
* కుప్పం నుంచి లోకేశ్ పాదయాత్ర ప్రారంభం
* ఈ నెల 27న కుప్పంలో లోకేశ్ పాదయాత్ర ప్రారంభం

Also Read..Nara Lokesh Padayatra : నారా లోకేశ్ పాదయాత్రకు లైన్ క్లియర్.. అనుమతి ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన చిత్తూరు జిల్లా ఎస్పీ

ఈ నెల‌ 27 నుంచి రాష్ట్రంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం కానుంది. రాష్ట్రంలో ఉన్న వివిధ వర్గాల ప్రజల‌ సమస్యలను ఫోకస్ చేస్తూ పాదయాత్ర సాగనుందని టీడీపీ నేతలు తెలిపారు. పాదయాత్రకు యువగళం అన్న పేరును ఖరారు చేశారు. 400 రోజులు 4వేల కిలోమీటర్లు ఈ పాదయాత్ర సాగనుంది.

Also Read..Pawan kalyan ‘VARAHI’ : ‘వారాహి’వాహనానికి పూజలు .. పొత్తుల గురించి పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

జనవరి 27న కుప్పంలో ప్రారంభమయ్యే ఈ యువగళం పాదయాత్ర ఇచ్చాపురంలో పూర్తి అవుతుంది. పాదయాత్రకు భారీ ఏర్పాట్లు చేసే పనిలో పడ్డారు నాయకులు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

అధికారంలో వచ్చిన తర్వాత యువత‌‌ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పిన వైసీపీ.. ఆ తర్వాత వారిని విస్మరించిందని టీడీపీ ఆరోపిస్తోంది. దీంతో ప్రధానంగా యువతని లక్ష్యంగా చేసి వారి సమస్యలను తెలుసుకుంటూ‌ పాదయాత్ర చేసేందుకు లోకేష్ సిద్దమయ్యారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు