Nara Lokesh Padayatra : నారా లోకేశ్ పాదయాత్రకు లైన్ క్లియర్.. అనుమతి ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన చిత్తూరు జిల్లా ఎస్పీ

నారా లోకేశ్ ‘యువగళం’పేరుతో చేపట్టిన పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇస్తారా? లేదా? అనే ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు అనుమతి లభించింది. ఈ విషయాన్ని చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు.

Nara Lokesh Padayatra : నారా లోకేశ్ పాదయాత్రకు లైన్ క్లియర్.. అనుమతి ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన చిత్తూరు జిల్లా ఎస్పీ

Chittoor district SP give permission to nara lokesh yuvagalam padaytara

Nara Lokesh Padayatra : నారా లోకేశ్ ‘యువగళం’పేరుతో చేపట్టిన పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇస్తారా? లేదా? అనే ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు అనుమతి లభించింది. ఈ విషయాన్ని చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. దీంతో ముందుగానే నిర్ణయించిన జనవరి 27న ఫిక్స్ చేసిన ముహూర్తానికే కుప్పం నియోజకవర్గం నుంచి లోకేశ్ పాదయాత్ర ప్రారంభంకానుంది. పోలీసుల నుంచి అనుమతి కోసం టీడీపీ నేతలు ఎన్నో విధాలుగా యత్నించారు. కానీ పోలీసుల నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. దీంతో టీడీపీ కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకుని అయినా పాదయాత్రను కొనసాగించాలని నిర్ణయించింది. మరోపక్క నిబంధనల ప్రకారం పోలీసులకు పలు లేఖలు రాసింది అనుమతి కోరుతూ.ఈక్రమంలో చిత్తూరు జిల్లా ఎస్పీనుంచి ఎట్టకేలకు అనుమతి లభించింది. దీంతో లోకేశ్ పాదయాత్రకు లైన్ క్లియర్ అయ్యింది. ఇక నిర్ణయించిన ముహూర్తానికే పాదయాత్ర ప్రారంభకానుంది.

Nara Lokesh Padayatra Route Map : లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర రూట్ మ్యాప్ ఖరారు..కుప్పం వరదరాజస్వామి దేవాలయం వద్ద పాదయాత్రకు శ్రీకారం

కాగా లోకేశ్ కు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు పోలీసులు. పాదయాత్రలోను నిర్వహించే సభల్లోను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని లోకేశ్ కు పోలీసులు సూచించినట్లుగా తెలుస్తోంది.అలాగే పాదయాత్రలో మార్పులు చేర్పులు ఉంటే ముందుగానే తమకు తెలియజేయాలని సూచించినట్లుగా కూడా తెలుస్తోంది. నిబంధనలకు లోబడి..శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలుగుకుండా పాదయాత్ర కొనసాగించాలని సూచించినట్లుగా తెలుస్తోంది.

జనవరి (2023) 27న యువగళం పేరుతో నారా లోకేశ్ కుప్పం నుంచి భారీ పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. 4వేల కిలోమీటర్లు, 400 రోజులు అన్న రీతిలో పాదయాత్ర చేయబోతున్నారు. ఓవైపు జీవో నెంబర్ 1పై హైకోర్టు జడ్జిమెంట్ వెయింటింగ్ లో ఉంది. మరోవైపు పోలీసుల ఆంక్షలు. ఈ క్రమంలో లోకేశ్ పాదయాత్రకు అనుమతి లభిస్తుందా లేదా అన్న దానిపై సందిగ్ధత నెలకొని ఉంది. గడిచిన మూడు నాలుగు రోజులుగా పెద్ద ఎత్తున హైడ్రామా నడిచిన విషయం తెలిసిందే..

పాదయాత్రకు షరతులు
బహిరంగ సభలను నిర్ణీత సమయాలకే నిర్వహించాలి..
రోడ్లపై సభలు,సమావేశాలు నిర్వహించకూడదు..
రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదు..
పాదయాత్రలో మార్పులు చేర్పులు ఉంటే ముందుగానే తెలియజేయాలి..
శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలుగకుండా పాదయాత్ర కొనసాగించాలి..
సభా ప్రాంగణంలో ప్రాథమిక చికిత్స్ శిభిరాలు ఉండేలా చూసుకోవాలి..
అంబులెన్స్ లను సిద్ధంగా ఉంచుకోవాలి..
అగ్నిమాపక వాహనాలను కూడా అందుబాటు ఉంచుకోవాలి..
బాణసంచా కాల్చకూడదు..
లోకేశ్ నిర్వహించే సభలకు వచ్చేవారు మారణాయుధాలు తీసుకురాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

Nara Lokesh Padayatra : నారా లోకేశ్ పాదయాత్రపై దాడులు చేయాలంటూ వైసీపీ నేత సోషల్ మీడియాలో మెసేజ్‌లు