Chandana
Police Stopped Chandana : టీడీపీ నేత పట్టాభి రామ్ ఎక్కుడున్నారోనని ఆయన కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. పట్టాభి రామ్ ఎక్కడున్నారో ఆచూకీ లేదని ఆయన భార్య చందన అన్నారు. నిన్న సాయంత్రం అరెస్టు చేసిన పోలీసులు ఇంతవరకూ సమాచారం ఇవ్వలేదని చెప్పారు. పట్టాభిని చూపించకపోతే డీజీపీ ఇంటిముందు నిరాహారదీక్ష చేస్తానని హెచ్చరించారు. రాత్రి నుంచి తమ పాప భయపడుతున్నారని వాపోయారు. నాన్న ఎప్పుడొస్తారని అడుగుతోందని చెప్పారు. ఎన్నిసార్లు తమ ఇంటిపై, తన భర్తపై దాడి చేస్తారని ప్రశ్నించారు.
పట్టాభి సతీమణి వద్దకు పోలీసులు వచ్చారు. పట్టాభిని 12గంటలకు గన్నవరం కోర్టుకు తీసుకువస్తున్నామని చందనకి పోలీసులు తెలిపారు. పట్టాభితో వీడియో కాల్ మాట్లాడించాలని చందన కోరారు. బైక్ పై చందన డీజీపీ ఇంటికి బయలుదేరారు. వెంటనే బైకును అడ్డుకున్న పోలీసులు చందనను ఇంట్లోకి తీసుకువచ్చారు.
Gannavaram High Tension : గన్నవరంలో హైటెన్షన్.. టీడీపీ ఆఫీస్‌పై దాడి, కారుకి నిప్పు
మరోవైపు పార్టీ కార్యాలయంపై దాడిని నిరసిస్తూ టీడీపీ చలో గన్నవరంకు పిలుపునిచ్చింది. కృష్ణా జిల్లాలో టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేస్తున్నారు. గన్నవరంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. పట్టాభి నివాసం వద్ద పోలీసులు మోహరించారు.