జనసేన పార్టీకి బిగ్‌షాక్‌.. రాజీనామా చేసిన పోతిన మహేశ్

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ జనసేన పార్టీకి బిగ్ షాక్ తగిలింది.

Pothina Mahesh

Pothina Mahesh Resigned To Janasena : ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ జనసేన పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీలో ముఖ్యనేతల్లో ఒకరైన పోతిన మహేశ్ జనసేనకు రాజీనామా చేశారు. పార్టీలో పదవికి, సభ్యత్వానికి ఆయన రాజీనామా చేస్తున్నట్లు ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఇప్పటి వరకు తనకు సహకరించిన జనసేన పార్టీ నాయకులకు, వీర మహిళలకు, జన సైనికులకు , పార్టీ పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ప్రకటనలో మహేశ్ పేర్కొన్నారు.

Also Read : జగన్ అనే నేను 2 నెలల్లో మళ్లీ మీ ముందుకు..: సీఎం జగన్

సార్వత్రిక ఎన్నికలకు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా వెళ్తున్న విషయం తెలిసిందే. మూడు పార్టీలు సీట్ల పంపకాలతో పాటు అభ్యర్థుల ప్రకటన ప్రక్రియసైతం పూర్తయింది. అయితే, పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ టికెట్ ను పోతిన మహేశ్ ఆశించారు. తనకే నియోజకవర్గం సీటును కేటాయించాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు, అభిమానులతో కలిసి ఆందోళనకుసైతం దిగారు. అయితే, పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని బీజేపీ నేత సుజనా చౌదరికి కేటాయించారు. దీంతో మహేశ్ తీవ్ర అసంతృప్తికి గురైనట్లు తెలిసింది. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ నుంచిసైతం పోతిన మహేశ్ కు తన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి హామీ రాలేదని సమాచారం. ఈ క్రమంలోనే ఆయన జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా లేఖను పార్టీ అనేధిత పవన్ కల్యాణ్ కు పంపించారు.

ఇదిలాఉంటే.. పోతిన మహేశ్ రాజీనామాతో ఆయన కార్యాలయంకు పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ జెండాలను తొలగించి.. వాటిని మహేశ్ అభిమానులు తగలబెట్టారు. పార్టీ మారే నిర్ణయం రెండు నెలల ముందు తీసుకుంటే జగన్ వైసీపీ పశ్చిమ నియోజకవర్గం టికెట్ ఇచ్చేవారని, నన్ను పవన్ కల్యాణ్ నమ్మించి మోసం చేశారంటూ పోతిన మహేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.