KA Paul : చంద్రబాబుపై విమర్శలు చేసిన కేఏ పాల్.. పవన్ కల్యాణ్‌కు మాత్రం ఓ రిక్వెస్ట్.. అదేమిటంటే?

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంకు వెళ్లారు. అయితే, అపాయింట్మెంట్ లేదని సెక్యూరిటీ సిబ్బంది పాల్ ను పంపించివేశారు.

KA Paul

AP Politics : ఏపీలో కేంద్ర ఎన్నికల బృందం పర్యటిస్తుంది. ఈ క్రమంలో మంగళవారం కేంద్ర ఎన్నికల చీఫ్ ను ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పరిస్థితులపై వివరించారు. అనంతరం పాల్ మీడియాతో మాట్లాడుతూ.. ఎలక్షన్ కమిషన్ ను కలవకుండా నన్ను అడ్డుకున్నారు. ఊరుపేరులేని పార్టీకి సమయం ఇచ్చారని పాల్ అన్నారు. పవన్, షర్మిల కంటే తెలంగాణలో నా పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చాయని తెలిపారు. ఏపీలో ఎన్నికలు మార్చిలో నిర్వహించొద్దని, ఈ ఏడాది చివరిలో పెట్టాలని, ఎన్నికల రోజే రిజల్ట్ కూడా వెల్లడించాలని, కోవిడ్ వ్యాప్తి మళ్లీ పెరుగుతుంది కాబట్టి జాగ్రత్త అవసరమని, అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఈసీని కోరినట్లు పాల్ అన్నారు.

Also Read : Chandrababu – Pawan Kalyan : రాష్ట్రంలో పరిస్థితులపై సీఈసీకి ఫిర్యాదు చేశాం.. వాళ్లను ఎన్నికల్లో ఉపయోగించొద్దని కోరాం

రెండు కులాలు, రెండు కుటుంబాలే ఏపీలో రాజ్యమేలుతున్నాయని, వారిపై నా పోరాటం ఆగదని, నేను ఇక్కడే ధర్నాకు దిగుతానని పాల్ అన్నారు. సౌత్, తెలుగు సత్తా మోదీకి చూపుదామని పాల్ ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు. బాబు రావాలంటే జాబు రావాలని అంటున్నారు.. గతంలో నువ్వే కదా ఉన్నావ్.. ఎన్ని జాబులిచ్చావు బాబు అంటూ పాల్ ప్రశ్నించారు. ఏపీ ప్రజలంతా కలిసి రావాలి, ప్రజాస్వామ్యంకోసం పోరాడదామని పాల్ పిలుపునిచ్చారు.

Also Read : Maldives-Lakshadweep Issue : భారత్ – మాల్దీవుల వివాదం వేళ.. భారత్‌పై అక్కస్సు వెళ్లగక్కిన చైనా.. ఇజ్రాయెల్ అభ్యర్థన ఇదే..

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కేఏ పాల్ ఓ రిక్వెస్ట్ చేశారు. పవన్ కు నా పర్సనల్ రిక్వెస్ట్.. వంగవీటి రంగాని చంపిన పార్టీతో కలవొద్దు అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసిపోటీ చేసేందుకు నిర్ణయించుకున్న విషయం విధితమే. ఈ క్రమంలో పాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాపులందరూ బయటకు పాల్ పిలుపునిచ్చారు. నా ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉంది. నా మీద విషయ ప్రయోగం చేసినా దేవుని కృపతో, వైద్యుల సహాయంతో బయటపడ్డానని పాల్ అన్నారు. నామీద విషయ ప్రయోగానికి సంబంధించి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు పాల్ పేర్కొన్నారు.

ఇదిలాఉంటే కేఏ పాల్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంకు వెళ్లారు. అయితే, అపాయింట్మెంట్ లేదని సెక్యూరిటీ సిబ్బంది పాల్ ను పంపించివేశారు.