Earthquake Tremors : ప్రకాశం జిల్లాలో భయం భయం.. వణుకు పుట్టిస్తున్న వరుస భూప్రకంపనలు.. అసలేం జరుగుతోంది? కారణమేంటి?

ఎన్నో ఏళ్ల నుంచి భూ ప్రకంపనలు ఈ ప్రాంతంలో సాధారణమేనని, అయితే వరుసగా మూడు రోజుల పాటు రావడం ఇదే తొలిసారి అంటూ స్థానికులు చెబుతున్నారు.

Earthquake Tremors : ప్రకాశం జిల్లా వాసులను వరుస భూ ప్రకంపనలు బెంబేలెత్తిస్తున్నాయి. గత మూడు రోజులుగా అనేక పర్యాయాలు స్వల్ప భూకంపం రావడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో గత మూడు రోజులుగా అనేక పర్యాయాలు భూమి స్వల్పంగా కంపించింది. శనివారం రెండు సెకన్లు.. ఆదివారం, సోమవారం ఒక సెకను పాటు భూ ప్రకంపనలు వచ్చాయి. సోమవారం ఉదయం పెద్ద శబ్దంతో ఒక సెకను పాటు భూ ప్రకంపనలు వచ్చాయి.

వరుసగా మూడు రోజులు రావడం ఇదే తొలిసారి..
ఎన్నో ఏళ్ల నుంచి భూ ప్రకంపనలు ఈ ప్రాంతంలో సాధారణమేనని, అయితే వరుసగా మూడు రోజుల పాటు రావడం ఇదే తొలిసారి అంటూ స్థానికులు చెబుతున్నారు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వరుస భూ ప్రకంపనలు కలకలం రేపుతున్నాయి. భూ ప్రకంపనలతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో రెండుసార్లు భూమి కంపించింది.

Also Read : తెలంగాణ పాలిటిక్స్‌ను మలుపు తిప్పిన “పుష్ప”.. ఈ పార్టీల యుద్ధం ఏ మలుపు తిరగబోతుంది?

శనివారం రెండుసార్లు, ఆదివారం ఒకసారి భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. రిక్టర్ స్కేల్ పై 3.1గా తీవ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. గుండ్లకమ్మ నది స్వరూపంలో చోటు చేసుకున్న మార్పుల వల్లే భూమి కంపించినట్లు అధికారులు భావిస్తున్నారు.

ఎప్పుడేం ప్రమాదం జరుగుతుందోనని భయాందోళనలు..
గత మూడు రోజులుగా భూ ప్రకంపనలు చోటు చేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఎప్పుడేం ప్రమాదం ముంచుకొస్తుందోనని స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. నిద్ర లేని రాత్రులు గడుపుడుతున్నారు. శనివారం మొదలైన ప్రకంపనలు.. ఆదివారం, సోమవారం సైతం చోటు చేసుకున్నాయి. దీనిపై మంత్రులు స్పందించారు. కలెక్టర్ ను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

Earthquake

తరుచుగా భూకంపాలు చోటు చేసుకోవడానికి కారణం ఏంటి అనే అంశంపై పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాల్సిందిగా కోరారు. గతంలో 2022లోనూ ఈ ప్రాంతంలో భూకంపాలు చోటు చేసుకున్నాయి. తరుచుగా భూమి కంపించడానికి కారణాలు ఏంటో తెలుసుకునే పనిలో అధికారులు ఉన్నారు. గుండ్లకమ్మ పరివాహక ప్రాంతాల్లో అంతర్ భాగంలో చోటు చేసుకుంటున్న మార్పులే భూ ప్రకంపనలకు ప్రధాన కారణం అని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

10 గంటల నుంచి 10 గంటల 50 నిమిషాల మధ్యలోనే భూప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. ఇదే సమయంలో ఎందుకు భూమి కంపిస్తోంది అనేది చర్చనీయాంశంగా మారింది.

 

Also Read : విశాఖలో వైసీపీకి షాక్‌ల మీద షాక్‌లు.. ఫ్యాన్‌ పార్టీకి హ్యాండ్‌ ఇస్తున్న కీలక నేతలు..