Visakha Girl Died : ప్రేమోన్మాది చేతిలో గాయపడిన యువతి మృతి

విశాఖపట్నంలో గత శనివారం ప్రేమోన్మాది దాడిలో గాయపడిన యువతి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది.

Visakha Girl Died : ప్రేమోన్మాది చేతిలో గాయపడిన యువతి మృతి

Visakha Girl Died

Updated On : November 20, 2021 / 7:37 AM IST

Visakha Girl Died :  విశాఖపట్నంలో గత శనివారం ప్రేమోన్మాది దాడిలో గాయపడిన యువతి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ కరాస ప్రాంతానికి చెందిన యువతి (20), భూపాలపల్లి జిల్లాకి చెందిన పి. హర్షవర్ధన్ రెడ్డి(21) పంజాబ్‌లో ఒకే కాలేజీలో చదువుకున్నారు. చదువు పూర్తవడంతో స్వస్థలాలకు చేరుకున్నారు.

చదవండి : Visakhapatnam : ప్రేమోన్మాది హర్షవర్ధన్ మృతి

హర్షవర్ధన్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వర్క్ ఫ్రమ్‌హోమ్ కావడంతో ఇంటివద్దనే ఉండి పనిచేస్తున్నాడు. గత వారం విశాఖ వెళ్లి లార్జిలో ఓ రూమ్ తీసుకున్నాడు హర్షవర్ధన్.. తాను విశాఖలో ఉన్నట్లు లార్జికి రావాలని సదరు యువతిని కోరాడు. దీంతో సదరు యువతి గత శనివారం లార్జికి వెళ్ళింది. అక్కడ వారిద్దరికీ పెళ్లి విషయంలో గొడవ జరిగింది. దీంతో తనతో తెచ్చుకున్న పెట్రోల్ వంటిపై పోసుకున్నాడు హర్షవర్ధన్, అదే సమయంలో యువతిపై కూడా పోసి నిప్పంటించాడు.

చదవండి : Visakha : స్టీల్ ప్లాంట్ ఆస్తుల వాల్యుయేషన్ కమిటీ సభ్యుల రాక..గేట్ల దిగ్భందానికి పిలుపు

గుర్తించిన లార్జి సిబ్బంది మంటలు ఆర్పి వీరిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో హర్షవర్ధన్‌కు 62 శాతం కాలిన గాయాలు కాగా, యువతికి 61 శాతం కాలిన గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హర్షవర్ధన్ మంగళవారం మృతి చెందగా, శుక్రవారం యువతి ప్రాణాలు విడిచింది.