DIG Ravi Kiran : మావోయిస్టుల లేఖ, చంద్రబాబు భద్రత, కంటికి ఆపరేషన్‌పై జైళ్ల శాఖ డీఐజీ కీలక వ్యాఖ్యలు

మా జైలు చుట్టూ ఐదు వాచ్ టవర్లు ఉన్నాయి. ఈ నెల 23వ తేదీన డ్రోన్ కెమెరా తిరిగినట్లుగా సమాచారం వచ్చింది. వెంటనే సమాచారం పోలీసులకు తెలియజేశాం. DIG Ravi Kiran

Prison Department DIG Ravi Kiran : రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుకి భద్రత కట్టుదిట్టంగానే ఉందన్నారు జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్. మావోయిస్టుల పేరుతో వచ్చిన లేఖ ఫేక్ అని తేల్చారు. చంద్రబాబు జైలుకి వచ్చినప్పటి నుంచి ప్రతీ వారం సెక్యూరిటీని పరిశీలిస్తూనే ఉన్నామన్నారు. జైల్లోకి ఎవరూ దొంగతనంగా కెమెరాను తీసుకురాలేదన్నారు. దొంగతనం కేసులో జైలుకి వచ్చిన ఓ నిందితుడి వద్ద బటన్ కెమెరా ఉంటే గుర్తించి పోలీసులకు అప్పజెప్పామన్నారు. జైలు చుట్టూ 5 వాచ్ టవర్లు ఉన్నాయన్నారు. ఈ నెల 23న డ్రోన్ కెమెరా తిరిగినట్లుగా సమాచారం వస్తే వెంటనే పోలీసులకు తెలియజేశామన్నారు రవికిరణ్. జైలు చుట్టూ అదనపు సెక్యూరిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు ఎస్పీ జగదీశ్.

చంద్రబాబు భద్రతపై జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ కామెంట్స్..
జైలు లోపల చంద్రబాబుకు భద్రత కట్టుదిట్టంగానే ఉంది. మావోయిస్టుల పేరుతో వచ్చిన లేఖ నిజం కాదని తేలింది. చంద్రబాబు జైలుకి వచ్చినప్పటి నుండి ప్రతివారం సెక్యూరిటీని పరిశీలిస్తూనే ఉన్నాం. శ్రీనివాస్ చక్రవర్తి అనే వ్యక్తి దొంగతనం కేసులో లోపలికి వచ్చాడు. అతని జేబులో బటన్ కెమెరా దొరికింది. వెంటనే దాన్ని గుర్తించి పోలీసులకు అందజేశాం. బటన్ కెమెరాను అతను జైలు లోపలికి తీసుకెళ్ల లేదు. అందులో జైలుకు సంబంధించిన సమాచారం ఏమీ లేదు. అతని కుటుంబ సమాచారం మాత్రమే ఉంది.

Also Read : జైల్లో వ్యక్తులను జగన్ అండ్ టీం సైలెంటుగా చంపేస్తారు.. చంద్రబాబు భద్రతపై అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు

మా జైలు చుట్టూ ఐదు వాచ్ టవర్లు ఉన్నాయి. ఈ నెల 23వ తేదీన డ్రోన్ కెమెరా తిరిగినట్లుగా సమాచారం వచ్చింది. వెంటనే సమాచారం పోలీసులకు తెలియజేశాం. పోలీసులు తగు చర్యలు తీసుకుంటున్నారు. జైలు లోపలికి గంజాయి ప్యాకెట్లు రావడం నిజం కాదు. జైలు లోపలికి గంజాయి ప్యాకెట్లు విసిరారు అనడం వాస్తవం కాదు. గంట గంటకు జైలు చుట్టూ పెట్రోలింగ్ జరుగుతూనే ఉంది. చంద్రబాబు కుటుంబ సభ్యులను ఫోటో తీశారు అనడంలో వాస్తవం లేదు.

ప్రతిరోజు జైలుకి చాలా లేఖలు వస్తుంటాయి. వాటిని పరిశీలిస్తూనే ఉంటాం. వాటిలో చాలావరకు ఫేక్ లెటర్లు ఉంటాయి. జైలు నుంచి లేఖ బయటకు వెళ్లాలంటే జైలు అధికారి సంతకం ఉండాలి. జైలు లోపల చంద్రబాబు విజువల్స్ గురించి మా ఉన్నతాధికారులకు సీల్డ్ కవర్ లో నివేదిక అందజేశా.
చంద్రబాబుకు సంబంధించి కంటి పరీక్షలు చేశాం. చంద్రబాబు‌ కుడి కంటికి ఆపరేషన్ చేయాల్సి ఉంది. కానీ అది అత్యవసరం కాదు. చంద్రబాబు ఇచ్చిన లేఖలో సమాచారం మార్చారని అనడం వాస్తవం కాదు. ప్రస్తుతం ఆయన బరువు 65 కిలోలు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. ఆయన శరీరానికి ఎలర్జీ తగ్గింది. స్నేహ బ్యారక్ ఎక్కడుందో నిందితులకు తెలుసు. కానీ బ్యారక్ లో చంద్రబాబు ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు.

జైలు నుంచి బయటకు వెళ్తున్న సమాచారంపై పోలీసులు నిశితంగా దర్యాప్తు చేస్తున్నారు. చంద్రబాబు రాశారంటూ ప్రచారంలో ఉన్న లేఖలో సంతకం నిజం కాదు. ఆయన భద్రతలో ఎటువంటి ఆందోళన అవసరం లేదు. బహిరంగ ప్రదేశంలో సెక్యూరిటీ ఇవ్వడం వేరు. జైలులో సెక్యూరిటీ ఇవ్వడం వేరు. జైలులో అత్యంత సెక్యూరిటీ అందించగలుగుతున్నాం. జైలులో మిగతా భద్రత కూడా మాకు ముఖ్యమే. చంద్రబాబు వ్యక్తిగత డాక్టర్లతో ప్రభుత్వ డాక్టర్లు సంప్రదిస్తూనే ఉన్నారు.

Also Read : జైలులో భద్రత, ఆరోగ్యంపై అనుమానాలు, ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఏసీబీ కోర్టు జడ్జికి లేఖ రాసిన చంద్రబాబు

ఎస్పీ జగదీష్ కామెంట్స్..
జైలు చుట్టూ అదనపు సెక్యూరిటీ ఏర్పాటు చేశాం. మావోయిస్టుల నుంచి లేఖ వచ్చిందని ప్రచారం జరుగుతోంది. దానికి సంబంధించి లోతుగా విచారణ జరిపాము.

ట్రెండింగ్ వార్తలు