ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ వచ్చే అవకాశం లేదు: ప్రొఫెసర్ నాగేశ్వర్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై 10టీవీ చర్చా కార్యక్రమంలో ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Professor Nageshwar: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై రెండు తెలుగు రాష్ట్రాల్లో అమితాసక్తి నెలకొంది. జూన్ 4న వెలువడే ఫలితాల కోసం తెలుగు ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. జూన్ 9న వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని వైసీపీ దీమాగా ఉంది. టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి అధికారంలోని వస్తుందని కూటమి నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ఎన్నికల ఫలితాలపై 10టీవీ చర్చా కార్యక్రమంలో ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఏపీ ఎన్నికల్లో హంగ్ వచ్చే అవకాశం లేదని.. ఏ పార్టీకి అధికారం వచ్చినా సీట్ల తేడా భారీ సంఖ్యలో ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో ఓట్లకు సీట్లకు సంబంధం ఉండదని.. ఓట్లు ఎక్కువ వచ్చి సీట్లు తక్కువ వచ్చిన సందర్భాలున్నాయని వివరించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు కసితో పనిచేశారని తెలిపారు. ఆయన ఇంకా ఏమన్నారో ఈ వీడియోలో చూడండి..

ట్రెండింగ్ వార్తలు