Punganur Cow: కాసుల వర్షం.. భారీ ధర పలికిన పుంగనూరు ఆవు

ఆంధ్రప్రదేశ్ లోని పలువురు రైతులు పుంగనూరు ఆవులను ప్రత్యేక శ్రద్ధతో పెంచుతారు. ఇంట్లో ఈ ఆవు ఉంటే మంచిదని నమ్మేవారి సంఖ్య ఎక్కువే. చిన్నగా ఉండటంతో పాటు వాటిని ముద్దుగానూ చాలా మంది పెంచుకుంటారు. ఇటీవలి కాలంలో వీటికి డిమాండ్ పెరిగింది. ఆ జాతి ఆవుల ధరలు లక్షల్లో పలుకుతున్నాయి. తాజాగా తెనాలికి చెందిన ఓ వ్యక్తి పుంగనూరు ఆవును రూ.4.10 లక్షలకు విక్రయించినట్లు తెలిసింది.

Punganur Cow

Punganur Cow: ఆంధ్రప్రదేశ్ లోని పలువురు రైతులు పుంగనూరు ఆవులను ప్రత్యేక శ్రద్ధతో పెంచుతారు. ఇంట్లో ఈ ఆవు ఉంటే మంచిదని నమ్మేవారి సంఖ్య ఎక్కువే. చిన్నగా ఉండటంతో పాటు వాటిని ముద్దుగానూ చాలా మంది పెంచుకుంటారు. చిత్తూరు జిల్లా పుంగనూరు పేరు చెప్పగానే పుంగనూరు ఆవులు గుర్తొస్తాయి. గత కొంతకాలంగా ఈ జాతి ఆవులు కనుమరుగయ్యే పరిస్థితులు తలెత్తాయి. అయితే ప్రస్తుతం ఈ ఆవులకు మంచి డిమాండ్ ఏర్పడింది.

Telangana Covid Cases : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులు అంటే

ఏపీలోని పలు ప్రాంతాల్లో ఈ ఆవులను అధిక ధర వెచ్చించి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఒక్కో ఆవు ధర రూ. 3లక్షల నుంచి రూ. 5లక్షల వరకూ పలుకుతోంది. తెనాలికి చెందిన ఓ వ్యక్తి పుంగనూరు ఆవును రూ.4.10 లక్షలకు విక్రయించినట్లు తెలిసింది. హరిద్వార్ నుంచి వచ్చిన బాబా రాందేవ్ ఆశ్రమ ప్రతినిధులు ఆవును పరిశీలించి భారీ ధర వెచ్చి కొనుగోలు చేసినట్లు తెలిసింది.

Ford Cars: భారత్ నుంచి నిష్క్రమిస్తున్న ప్రముఖ కార్ల కంపెనీ ఫోర్డ్‌.. కారణమేమంటే?

ఈ ఆవులు పాలు తక్కువగా ఇస్తాయని రైతులు పెంచుకొనేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అయితే మిగతా ఆవుల పాలతో పోలిస్తే పుంగనూరు ఆవుల పాలలో వెన్న శాతం ఎక్కువగా ఉంటుందట. దీనికితోడు పాలు రుచికరంగానూ ఉంటాయి. వీటిలో ఔషధ గుణాలు ఉంటాయనేది చాలా మంది నమ్మకం.