Ford Cars: భారత్ నుంచి నిష్క్రమిస్తున్న ప్రముఖ కార్ల కంపెనీ ఫోర్డ్‌.. కారణమేమంటే?

భారత్ ఆటో మొబైల్ రంగంలో అమెరికన్ కంపెనీ ఫోర్డ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. దేశంలో ఎక్కువ మంది ఇష్టపడే కార్ల జాబితాలో ఫోర్డ్ కంపెనీవి కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఆ కంపెనీ భారత్ లో తమ కార్యకలాపాలు నిలివేస్తుంది.

Ford Cars: భారత్ నుంచి నిష్క్రమిస్తున్న ప్రముఖ కార్ల కంపెనీ ఫోర్డ్‌.. కారణమేమంటే?

Ford

Ford Cars: భారత్ ఆటో మొబైల్ రంగంలో అమెరికన్ కంపెనీ ఫోర్డ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. దేశంలో ఎక్కువ మంది ఇష్టపడే కార్ల జాబితాలో ఫోర్డ్  మోటార్ కంపెనీవి కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఆ కంపెనీ భారత్ లో తమ కార్యకలాపాలను నిలిపివేసేందుకు సిద్ధమైంది. ఎకోస్పోర్ట్ యొక్క చివరి యూనిట్ విడుదల చేయడంతో జనరల్ మోటార్స్, దేవూ తర్వాత భారతదేశం నుండి నిష్క్రమించిన మూడవ ప్రధాన కార్ల తయారీ సంస్థగా ఫోర్డ్ నిలిచింది. 9 సెప్టెంబర్ 2021న భారత మార్కెట్ లో కార్ల అమ్మకాలను నిలిపివేస్తామని ఫోర్డ్ ప్రకటించింది. అయితే దాని ఎగుమతి మార్కెట్ కమిట్‌మెంట్‌ల కోసం వాహనాలను తయారు చేయడం కొనసాగిస్తుంది.  తమిళనాడు తయారీ కేంద్రం నుండి చివరి కారును విడుదల చేసింది. ఇక్కడ పరిశ్రమను కూడా  నెలలో మూసివేయబడుతుంది.

Devendra Fadnavis: ఆ రోజు నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఉద్ధవ్ థాక్రే స్పందించలేదు

దేశంలో ఫోర్డ్ కు చెందిన రెండు ప్లాంట్లు ఉన్నాయి. అందులో ఒకటి గుజరాత్ లోని అహ్మదాబాద్ సమీపంలోని సనంద్ లో ఉండగా, మరొకటి తమిళనాడులోని చెన్నై సమీపంలో ఉంది. అహ్మదాబాద్ లోని ప్లాంట్ నుంచి ఫోర్డ్ వారి ఫిగో, ఫ్రీస్టైల్, ఆస్పైర్ వంటి చిన్న కార్లను ఉత్పత్తి చేస్తుంది. చెన్నై ప్లాంట్ నుంచి ఫోర్డ్ ఎకోస్పోర్ట్, ఎండీవర్‌లను ఉత్పత్తి చేస్తుంది. సనంద్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేసిన మోడల్‌లు – ఫిగో, ఆస్పైర్ భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ఆశించిన స్థాయిలో విక్రయాలు జరగలేదు. దీంతో ఇక్కడ ఉత్పత్తిని అక్టోబర్ 2021లోనే నిలిపివేసింది. అయితే భవిష్యత్తులో ఈ ప్లాంట్‌ను టాటా మోటార్స్ స్వాధీనం చేసుకోనుంది.

Viral Video : చదరంగం ఆడుతున్న బాలుడి వేలు విరిచిన రోబో

ప్రస్తుతం చెన్నై యూనిట్ ని కూడా నిలిపివేయడంతో దేశంలో తన కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసినట్లయింది. దేశంలోని ఇతర కార్ల కంపెనీలకు ఫోర్డ్ గట్టిపోటీ ఇచ్చింది. అయితే కంపెనీ తీసుకొచ్చిన కొత్త డిజైన్ కార్లు మార్కెట్ లో ఆశించినంతగా విక్రయాలు జరగలేదు. దీంతో ఫోర్డ్ భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. గత దశాబ్ద కాలంగా సుమారు రెండు బిలియన్ డాలర్ల నష్టాలను చవిచూసినట్లు ఫోర్డ్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ నష్టాలను అధిగమించే మార్గం లేక.. దేశం నుంచి నిష్క్రమించడం తప్ప వేరే మార్గం కనపడలేదని ఫోర్డ్ ప్రతినిధులు తెలిపారు.