Devendra Fadnavis: ఆ రోజు నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఉద్ధవ్ థాక్రే స్పందించలేదు

బాలాసాహెబ్‌ థాక్రే సిద్ధాంతాలను పాటిస్తున్న అసలైన శివసేన తమతోనే ఉందని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, బీజేపీ నేత ఫడ్నవీస్ అన్నారు. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో షిండే శివసేనతోనే కలిసి పోటీచేసి ఇప్పుడున్న స్థానాల కంటే ఎక్కువ సీట్లు కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Devendra Fadnavis: ఆ రోజు నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఉద్ధవ్ థాక్రే స్పందించలేదు

Devendra Fadnavis

Devendra Fadnavis: బాలాసాహెబ్‌ థాక్రే సిద్ధాంతాలను పాటిస్తున్న అసలైన శివసేన తమతోనే ఉందని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, బీజేపీ నేత ఫడ్నవీస్ అన్నారు. ఏక్ నాథ్ షిండే శివసేనలోని తన వర్గం ఎమ్మెల్యేలతో బయటకు వచ్చి బీజేపీతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సీఎంగా షిండే బాధ్యతలు స్వీకరించిన విషయం విధితమే. ప్రస్తుతం శివసేన మాదంటే మాదంటూ షిండే, ఉద్ధవ్ థాక్రే వర్గాలు వాదులాడుకుంటున్నాయి. కోర్టుకుసైతం వెళ్లాయి. ఈ సమయంలో ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసలైన శివసేన మాతోనే ఉందంటూ వ్యాఖ్యానించారు. అంతేకాక.. వచ్చే ఎన్నికల్లో షిండే శివసేనతోనే కలిసి పోటీచేసి ఇప్పుడున్న స్థానాల కంటే ఎక్కువ సీట్లు కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Ladakh Standoff: భారత్‌ను రెచ్చగొడుతున్న చైనా.. జాగ్రత్తగా బదులిస్తున్న భారత్

మహారాష్ట్ర లో  బీజేపీ ఎగ్జిక్యూటివ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఫడ్నవీస్ మాట్లాడుతూ.. గతంలో జరిగిన సంఘటనను వివరించారు. 2019లో బీజేపీకి వెన్నుపోటు పొడిచి ఎన్ సీపీతో చేతులు కలిపినప్పుడే ఉద్ధవ్ థాక్రే తలరాత ఖరారైందని అన్నాడు. 2019 ఎన్నికల్లో కలిసి పోటీ చేసినప్పుడు ఆయనకు తాము ఎలాంటి హామీ ఇవ్వలేదని ఫడ్నవీస్ తెలిపారు. ఎన్సీపీతో జతకట్టాలని ఉద్ధవ్ ముందుగానే నిర్ణయించుకున్నారని మాకు అర్థమైందని అన్నారు. ఎన్సీపీతో చేతులు కలిపేందుకు శివసేన సిద్ధమైనప్పుడు ఆ రోజు తాను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఉద్ధవ్ తన ఫోన్ ఎత్తలేదని తెలిపారు.

Brahmarshi Patriji : పిరమిడ్ ధ్యాన గురువు సుభాష్ పత్రిజీ కన్నుమూత

ఏక్ నాథ్ షిండేకు సీఎం పదవి ఇవ్వడానికి బీజేపీలోని కొందరు ఒప్పుకోలేదని, బీజేపీ కార్యకర్తలంతా తననే సీఎం కావాలని అనుకున్నారని ఫడ్నవీస్ అన్నారు. కానీ అలా జరగపోయేసరికి తాను ఎంతో బాధపడ్డానని తెలిపాడు. తాము అధికారం కోసం కాదు.. సిద్ధాంతాల కోసమే పనిచేస్తున్నామని నిరూపించేందుకే షిండేకు సీఎం బాధ్యతలు అప్పగించామని ఫడ్నవీస్ అన్నారు.