Brahmarshi Patriji : పిరమిడ్ ధ్యాన గురువు సుభాష్ పత్రిజీ కన్నుమూత

ప్రముఖ  పిరమిడ్ ధ్యాన గురువు సుభాష్ పత్రిజీ కన్నుమూశారు.  ఆయన వయస్సు 74 సంవత్సరాలు.

Brahmarshi Patriji : పిరమిడ్ ధ్యాన గురువు సుభాష్ పత్రిజీ కన్నుమూత

Brahmarshi Patriji

Updated On : July 24, 2022 / 8:27 PM IST

Brahmarshi Patriji :  ప్రముఖ  పిరమిడ్ ధ్యాన గురువు సుభాష్ పత్రిజీ కన్నుమూశారు.  ఆయన వయస్సు 74 సంవత్సరాలు. గత కొంతకాలంగా మూత్ర పిండాలవ్యాధితో బాధపడుతున్న ఆయన ఆదివారం సాయంత్రం మృతి చెందారు. ఇటీవల  ఆయన కొన్నిరోజులు బెంగుళూరులో చికిత్స పొంది వచ్చారు.

రెండు రోజుల క్రితం మళ్లీ పరిస్ధితి విషమించటంతో ఆయన్ను కడ్తాల్ లోని మహేశ్వరం పిరమిడ్ ధ్యాన యోగ కేంద్రానికి తరలించారు. ఆదివారం సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచారు.  సోమవారం సాయంత్రం 5 గంటలకు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు.