Telangana Covid Cases : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులు అంటే

తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది.

Telangana Covid Cases : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులు అంటే

Telangana Covid

Updated On : July 24, 2022 / 10:04 PM IST

Telangana Covid Cases : తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది.

Bill Gates: మంకీపాక్స్ కూడా బిల్‌గేట్స్ కుట్రే.. నిజం ఏంటి?

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 24వేల 927 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 531 మందికి పాజిటివ్ గా తేలింది. అత్యధికంగా హైదరాబాద్ లో 281 కొత్త కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 42, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 34 కేసులు, ఖమ్మం జిల్లాలో 22 కేసులు, కరీంనగర్ జిల్లాలో 14 కేసులు, మహబూబాబాద్ జిల్లాలో 17 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 612 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఊరటనిచ్చే అంశం ఏంటంటే.. కొత్తగా కొవిడ్ మరణాలేవీ సంభవించలేదు.

Monkeypox: WHO మంకీపాక్స్‌ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించటానికి ఐదు కారణాలు.. అవేమిటంటే?

రాష్ట్రంలో నేటివరకు 8,14,303 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 05వేల 562 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4వేల 630గా ఉంది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 33వేల 017 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 652 మందికి పాజిటివ్ గా తేలింది.

Covid Vaccine: ఒక్క డోసు కూడా తీసుకోని 4 కోట్ల మంది.. కేంద్రం ప్రకటన

కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ప్రజలకు జాగ్రత్తలు చెప్పింది. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించింది. చేతులను తరుచుగా శుభ్రంగా కడుక్కోవాలంది. అనవసర ప్రయాణాలు చేయొద్దని సూచించింది. పెద్దలు, పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw