Bill Gates: మంకీపాక్స్ కూడా బిల్‌గేట్స్ కుట్రే.. నిజం ఏంటి?

మంకీపాక్స్ వ్యాపించడంలో బిల్‌గేట్స్ కుట్ర ఉందా? కరోనా వైరస్‌తోపాటు, మంకీపాక్స్ వ్యాప్తి కూడా ఆయన అజెండాలో భాగంగానే జరుగుతోందా? ఈ వాదనల్లో నిజమెంత? వైరస్‌ల వ్యాప్తికి, బిల్‌గేట్స్‌కూ నిజంగా సంబంధం ఉందా?

Bill Gates: మంకీపాక్స్ కూడా బిల్‌గేట్స్ కుట్రే.. నిజం ఏంటి?

Bill Gates

Bill Gates: రెండేళ్లక్రితం కరోనా వ్యాపించినప్పుడు దీని పుట్టుక గురించి అనేక సిద్ధాంతాలు ప్రచారమయ్యాయి. వాటిలో ఒకటి ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్‌గేట్స్ ఈ వైరస్‌ను సృష్టించాడని! ముందుగా వైరస్ సృష్టించి, తర్వాత వాటికి వ్యాక్సిన్‌లు అమ్మి సొమ్ము చేసుకునేందుకు ఆయన పరోక్షంగా సహకరిస్తున్నారనేది ఈ ఆరోపణ. ఈ ప్రచారంలో నిజం లేదని తర్వాత అనేక సంస్థలు తేల్చాయి. ఈ కరోనా ఇంకా ముగియకముందే మరో వైరస్/వ్యాధి ప్రపంచాన్ని వణికిస్తోంది. అదే మంకీపాక్స్. ఇది కూడా బిల్‌గేట్స్ సృష్టించిందే అంటూ ఇప్పుడు మరో ప్రచారం మొదలైంది. చాలామంది అనుకుంటున్నట్లుగానే.. ఈ వైరస్‌లకు, బిల్‌గేట్స్‌కూ సంబంధం ఉందా?

Son Murdered By Father: కొడుకును చంపి ముక్కలుగా నరికిన తండ్రి.. తప్పించుకునేందుకు ఏం చేశాడంటే
బిల్‌గేట్స్‌కు, కరోనాకు ముడిపెడుతూ 2020 ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో మీడియా, సోషల్ మీడియాలో కనీసం 12 లక్షల సార్లు ప్రచారం జరిగినట్లు అంచనా. దీంతో ఇది చాలామంది నిజమేనని నమ్మారు. కానీ, ఈ విషయంలోనే నిజం లేదని అనేక అంతర్జాతీయ సంస్థలు తేల్చాయి. ఇప్పుడు మంకీపాక్స్ విషయంలో కూడా అలాంటి ప్రచారమే మొదలైంది. బిల్‌గేట్స్‌ ఎజెండా ప్రకారమే మళ్లీ మంకీపాక్స్ వ్యాప్తి మొదలైందని ఆ ప్రచారాల సారాంశం. మరోవైపు మన దేశంలో కేరళలోనే తొలి, రెండో కేసు నమోదు కావడం వెనుక కూడా బిల్‌గేట్స్‌ కుట్ర ఉందని ఇంకొందరు ప్రచారం చేస్తున్నారు.

Linking Aadhaar-Voter ID: ఓటర్ ఐడీతో ఆధార్ లింక్.. సుప్రీంకోర్టులో రేపు విచారణ

బిల్‌గేట్స్‌ ఎజెండా కేరళ నుంచే అమలవడం ప్రారంభమవుతుందని కొందరు ఆరోపిస్తున్నారు. అయితే, అనేక మీడియా సంస్థల అంచనా ప్రకారం.. ఈ ప్రచారానికి, బిల్‌గేట్స్‌కు అసలు సంబంధం లేదు. ఆయన మానవాళి సంక్షేమం కోసం బిలియన్ డాలర్లు విరాళంగా అందించారు. అంతేకాదు.. కేవలం సేవా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా, వివిధ రంగాల్లో పరిశోధనల్ని కూడా ప్రోత్సహిస్తున్నారు. వాతావరణ మార్పులు, వైరస్ వ్యాప్తి, వాటిని ఎదుర్కొనే అంశాలు వంటి వాటిపై ప్రచారం, పరిశోధనలు కూడా ఆయన సంస్థల ఆధ్వర్యంలో చేస్తున్నారు. కొత్త వైరస్​లు, ఇతర వ్యాధికారకాలను గుర్తించేందుకు రోజుకు ఏకంగా లక్షన్నర నమూనాలను అధ్యయనం చేయగల యంత్రాలు, టెక్నాలజీ గేట్స్​ ఫౌండేషన్​ దగ్గర ఉన్నాయి.

Syed Hafeez: ‘ఫోర్బ్స్ ఇండియా’ జాబితాలో తెలంగాణ వాసికి చోటు

భవిష్యత్తులో రాబోయే వైరస్‌లను ఎలా ఎదుర్కోవాలో సూచిస్తూ పుస్తకాలు కూడా రాస్తున్నారు. కొత్త వ్యాధులు, వైరస్‌లను ఎదుర్కోవడంలో ఇంతగా కృషి చేస్తున్నప్పటికీ ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం సాగడం గమనార్హం. తనపై వస్తున్న ప్రచారాలు ఖండించడానికి వీలు లేకుండా, అసంబద్ధంగా ఉన్నాయని బిల్‌గేట్స్ గతంలో వ్యాఖ్యానించారు.