Monkeypox: WHO మంకీపాక్స్‌ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించటానికి ఐదు కారణాలు.. అవేమిటంటే?

ప్రపంచ దేశాలను మంకీపాక్స్ భయపెడుతోంది. రోజురోజుకు మంకీపాక్స్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 16వేల మంకీపాక్స్ కేసులు నమోదైయినట్లు WHO (ప్రపంచ ఆరోగ్య సంస్థ) తెలిపింది. కేసులు పెరుగుతుండటంతో ఈ వ్యాధిని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ గా ప్రకటించింది. ఇందుకు ప్రధానంగా ఐదు కారణాలు ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ తెలిపారు.

Monkeypox: WHO మంకీపాక్స్‌ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించటానికి ఐదు కారణాలు.. అవేమిటంటే?

Monkeypox

Monkeypox: ప్రపంచ దేశాలను మంకీపాక్స్ భయపెడుతోంది. రోజురోజుకు మంకీపాక్స్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 16వేల మంకీపాక్స్ కేసులు నమోదైయినట్లు WHO (ప్రపంచ ఆరోగ్య సంస్థ) తెలిపింది. గతకొద్దికాలం వరకు కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడించింది. ఆ వైరస్ వ్యాప్తి ప్రస్తుతం తగ్గుతున్న క్రమంలో మంకీపాక్స్ రూపంలో మరో వ్యాధి దేశాధినేతలను భయపెడుతోంది. మంకీపాక్స్ వల్ల మరణాలు తక్కువగానే నమోదవుతున్నప్పటికీ వ్యాధి విస్తరిస్తున్న తీరునుచూసి WHO అలర్ట్ అయింది. శనివారం WHO చీఫ్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ శనివారం మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మంకీపాక్స్ ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించారు.

Monkeypox: పెరుగుతున్న మంకీపాక్స్ కేసులు.. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ

ఇందుకు కారణాలను ట్రెడోస్ వివరించారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 75 దేశాల్లో మంకీపాక్స్ వ్యాపించిందని తెలిపారు. 16వేల కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయని అన్నారు. మంకీపాక్స్ ఒకప్పుడు కేవలం ఆఫ్రికాకు మాత్రమే పరిమితం అయ్యేదని, కానీ తాజా నివేదికలు చూస్తుంటే ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్నదని తెలిపారు. ఈ నివేదికల ఆధారంగా మంకీపాక్స్ ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ గా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. దేశాలు సమన్వయ ప్రతిస్పందనతో వైరస్ వ్యాప్తిని నియంత్రించగలవని WHO చీఫ్ చెప్పారు. ప్రధానంగా మంకీపాక్స్‌ను ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించడానికి ఐదు కారణాలు ఉన్నాయని తెలిపారు.

Monkeypox in Children : అమెరికాలో తొలిసారిగా చిన్నారుల్లో మంకీపాక్స్.. ఇద్దరిలో లక్షణాలు..!

వైరస్ “నాన్-ఎండెమిక్ దేశాలకు” వ్యాపించిందని, ఆయా దేశాలు అందించిన సమాచారం మేరకు.. వైరస్ ఇంతకు ముందుచూడని అనేక దేశాలకు వేగంగా వ్యాపించిందని ట్రెడోస్ చెప్పారు. అదేవిధంగా అంతర్జాతీయ ఆందోళనతో కూడిన ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించడానికి మూడు ప్రమాణాలు ఉన్నాయని అన్నారు. గత నెలలో ప్యానెల్‌ను కలుసుకున్నప్పుడు 47 దేశాల నుండి 3,040 కేసులు నమోదయ్యాయని, ఈ సంఖ్య ఒక్క నెలలోనే ఐదు రెట్లు పెరిగిందని ఢబ్ల్యూహెచ్ఓ చీఫ్ డాక్టర్ ట్రెడోస్ అధనామ్ అన్నారు. “మానవ ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉందని, అంతర్జాతీయంగా మంకీపాక్స్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని ఈ వైరస్ ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించడం జరిగిందని WHO చీఫ్ చెప్పారు.