బీభత్సం : పూతలపట్టు వైసీపీ అభ్యర్థి బాబుపై దాడి

చిత్తూరు జిల్లా పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గం ఐరాల మండలం కట్టకిందపల్లిలో ఉద్రిక్త వాతావరణం. 

  • Publish Date - April 11, 2019 / 10:48 AM IST

చిత్తూరు జిల్లా పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గం ఐరాల మండలం కట్టకిందపల్లిలో ఉద్రిక్త వాతావరణం. 

చిత్తూరు జిల్లా పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గం ఐరాల మండలం కట్టకిందపల్లిలో ఉద్రిక్త వాతావరణం. వైసీపీ అభ్యర్ధి ఎమ్మెస్ బాబుపై టీడీపీ ఆందోళనకారులు దాడి చేశారు. దాడిలో ఆయన వాహనం ధ్వంసం అయ్యింది. గాయపడిన అభ్యర్థి ఎమ్మెస్ బాబును కార్యకర్తలు ఆస్పత్రికి తరలించారు. మరోవైపు కట్టకిందపల్లి పోలింగ్ కేంద్రంలోనూ టీడీపీ వర్గాలు దాడికి దిగాయి. రిటర్నింగ్ ఆఫీసర్ కారును టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. పోలింగ్ బూత్ లోకి చొరబడి ఈవీఎంను పగలగొట్టారు.
Read Also : EVMలు బాగా పని చేస్తున్నాయ్.. తప్పుడు వార్తలు నమ్మొద్దు : ఈసీ ద్వివేదీ

కట్టకిందపల్లి పోలింగ్ బూత్ లో టీడీపీ కార్యకర్తలు రిగ్గింగ్ చేస్తున్నారని సమాచారం అందుకున్న వైసీపీ అభ్యర్ధి ఎమ్మెస్ బాబు.. పోలింగ్ బూత్ చేరుకున్నారు. అక్కడ ఎమ్మెస్ బాబుకు టీడీపీ నాయకుల మధ్య వాగ్వావాదం జరిగింది. ఈ సమయంలోనే టీడీపీ నాయకులు ఈవీఎం, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. అక్కడ్నించి బయటకొచ్చి రిటర్నింగ్ అధికారి వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు.

పోలింగ్ బూత్ నుంచి వెళ్లిపోతున్న వైసీపీ అభ్యర్థి ఎమ్మెస్ బాబు కారును టీడీపీ కార్యకర్తలు వెంబడించారు. కారు అద్దాలు ధ్వంసం చేశారు. అతనిపై దాడి చేశారు. గాయపడిన ఎమ్మెస్ బాబును చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఎమ్మెస్ బాబును,  వైస్ జగన్ కలవాటినికి నిరాకరించినందుకు మవస్తాపం చెంది ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. అప్పట్లో ఆ వీడియో వైరల్ అయ్యింది. 
Read Also : ప్రచారంలోనే కుప్పకూలిన BJP MLA : మృతి