ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌‌గా రఘురామ కృష్ణరాజు ఎన్నిక.. బాధ్యతల స్వీకరణ

మర్యాదపూర్వకంగా పోడియం వద్దకు తీసుకువెళ్లి కుర్చీలో కూర్చోబెట్టారు కూటమి నేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, విష్ణుకుమార్ రాజు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌‌గా ఉండి ఎమ్మెల్యే, టీడీపీ నేత రఘురామ కృష్ణరాజు ఇవాళ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిప్యూటీ స్పీకర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. మర్యాదపూర్వకంగా పోడియం వద్దకు తీసుకువెళ్లి కుర్చీలో కూర్చోబెట్టారు కూటమి నేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, విష్ణుకుమార్ రాజు.

అంతకుముందు డిప్యూటీ స్పీకర్ పదవికి రఘురామ కృష్ణరాజు పేరును ప్రతిపాదిస్తూ 3 సెట్ల నామినేషన్ దాఖలు అయింది. రఘురామ కృష్ణరాజు పేరుని ప్రతిపాదిస్తూ ఎన్డీఏ కూటమిలోని మూడు పార్టీల తరఫున 3 నామినేషన్లను దాఖలు చేయడం విదితమే.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ ఉదయం 9 గంటల నుంచి జరుగుతున్నాయి. కాగా, అసెంబ్లీలో చీఫ్‌విప్‌గా జీవీ ఆంజనేయులు, మండలిలో చీఫ్‌విప్‌గా పంచుమర్తి అనురాధను ఇప్పటికే నియమించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. రాజమౌళి తీసిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని “నాటు.. నాటు” పాట ఎంత పాపులర్‌ అయ్యిందో రఘురామకృష్ణరాజు నిర్వహించిన రచ్చబండ ప్రోగ్రాం కూడా రాజకీయాల్లో అంతటి పాపులర్‌ అయ్యిందని చెప్పారు. ఆయనకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నట్లు చెప్పారు. పంచెకట్టులో రఘురామ కృష్ణరాజు వచ్చి స్పీకర్‌ స్థానానికి నిండుతనం తీసుకొచ్చారని అన్నారు.

ఏపీ ప్రభుత్వం మమ్మల్ని ప్రజల పక్షాన మాట్లాడకుండా చేస్తోంది: వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి