ఏపీ ప్రభుత్వం మమ్మల్ని ప్రజల పక్షాన మాట్లాడకుండా చేస్తోంది: వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి

ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఏపీ ప్రభుత్వం మమ్మల్ని ప్రజల పక్షాన మాట్లాడకుండా చేస్తోంది: వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి

Varudu Kalyani

Updated On : November 14, 2024 / 3:22 PM IST

Varudu Kalyani: ప్రజల పక్షాన మాట్లాడకుండా ప్రభుత్వం తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అన్నారు. అమరావతిలోని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడారు. ఈ బడ్జెట్‌తో తమ తలరాతలు మారిపోతాయని ప్రజలు ఆశపడ్డారని, వారి ఆశలు నిరాశలు అయ్యాయని తెలిపారు.

దీపం పథకం కోసం కేటాయింపులు ఎంతమందికి ఇస్తారనేది తాము ప్రశ్నించామని చెప్పారు. రాష్ట్రంలో 2.7 కోట్ల మంది మహిళలున్నారని, ఒక్కొక్కరికి ఏడాదికి 18 వేలు ఇస్తామన్నారని, ఆ లెక్కలేవని నిలదీశారు. టీచర్లు తమ పరిస్థితి ఏంటో తెలియక ఆందోళన చెందుతున్నారని అన్నారు.

ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ఎవరూ చేయలేని మంచి పనులు జగన్మోహన్ రెడ్డి చేశారని తెలిపారు. 4 పోర్టులు.. 10 ఫిషింగ్ హార్బర్లు, 10 వేల రైతు భరోసా కేంద్రాలు కట్టడం వంటి మంచి పనులు చేస్తే తమ గత ప్రభుత్వానికి చీకటి పాలన అంటారా అని నిలదీశారు.

మూడేళ్లు వరుసగా ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఏపీని ఉంచడం చీకటి పాలన అంటారా? అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో 30 లక్షల 99 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించారని తెలిపారు. జగన్ సీఎం అవ్వకముందు మచిలీపట్నం, మూలపేటలో ఒక్క పిట్టగోడైనా కట్టారా అని ప్రశ్నించారు.

వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ.. బడ్జెట్ పై చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని, పవర్ సెక్టార్ పై చర్చ జరగకుండా చేశారని అన్నారు. అనేక మీటింగ్ లలో కరెంట్ ఛార్జీలు పెంచనని చంద్రబాబు చెప్పారని తెలిపారు. ఒక్క రూపాయి ఛార్జీ పెంచనని చెప్పి ఇప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారని చెప్పారు.

ఏడేళ్ల బాలుడు ఎడమ కంటికి సర్జరీ చేయించుకునేందుకు వెళ్తే కుడి కంటికి చేసిన డాక్టర్‌