వైసీపీకి బిగ్ షాక్.. ఎంపీ మోపిదేవి వెంకటరమణ గుడ్‌బై..? త్వరలో టీడీపీ గూటికి..

మోపిదేవి వెంకటరమణ 2014 ఎన్నికల ముందు నుంచి వైసీపీలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన పార్టీ వీడేందుకు సిద్ధమవ్వటం వైసీపీకి బిగ్ షాక్ అనే చెప్పొచ్చు.

వైసీపీకి బిగ్ షాక్.. ఎంపీ మోపిదేవి వెంకటరమణ గుడ్‌బై..? త్వరలో టీడీపీ గూటికి..

Mopidevi Venkata Ramana

MP Mopidevi: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. రేపు వైసీపీ అధిష్టానానికి రాజీనామా లేఖను పంపించనున్నట్లు తెలిసింది. త్వరలో ఆయన సీఎం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే మంత్రి అనగాని సత్యప్రసాద్ తో మోపిదేవి భేటీ అయ్యారు. గత కాలంగా వైసీపీ అధిష్టానంపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. మోపిదేవి వెంకటరమణ ప్రస్తుతం బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడిగాకూడా ఉన్నారు. రాజ్యసభ సభ్యత్వంతో పాటుగా జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేస్తారని ప్రచారం నడుస్తోంది.

Also Read :  హైడ్రా కూల్చివేతలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై టీజీ వెంకటేష్ హాట్ కామెంట్స్

మోపిదేవి వెంకటరమణ 2014 ఎన్నికల ముందు నుంచి వైసీపీలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన పార్టీ వీడేందుకు సిద్ధమవ్వటం వైసీపీకి బిగ్ షాక్ అనే చెప్పొచ్చు. గుంటూరు ఉమ్మడి జిల్లాలో మోపిదేవి వెంకటరమణ సీనియర్ రాజకీయ నేతగా ఎదిగారు. 1989, 1994లో కూచినపూడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మోపిదేవి పోటీ చేసి ఓడిపోయారు. 1999, 2004 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్విభజన తరువాత రేపల్లె నియోజకవర్గం నుంచి 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన ఆయన విజయం సాధించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు.

2014లో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి రాజీనామాచేసిన మోపిదేవి వెంకటరమణ వైసీపీలో చేరారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున రేపల్లె నుంచి పోటీచేసి ఓడిపోయారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మోపిదేవికి ఎమ్మెల్సీ పదవితోపాటు కేబినెట్ లోనూ అవకాశం కల్పించారు. అయితే, కొద్దికాలానికే పార్టీ అధిష్టానం ఆదేశం మేరకు మోపిదేవి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. 2020లో వైసీపీ తరపున రాజ్యసభకు ఎన్నికయ్యారు.