Raksha Bandhan 2025: మీ సోదరుడికి రాఖీ కట్టేటప్పుడు ఈ 10 తప్పులు చేయొద్దు.. జాగ్రత్త..

శుభ ముహూర్తాన్ని పట్టించుకోకపోవడం వంటి పనులు చేయకూడదు. అంటే రాహుకాలం లేదా భద్రకాలంలో రాఖీ కట్టడం దురదృష్టం తెస్తుందని నమ్మకం ఉంది. పంచాంగంలో సూచించిన శుభ ముహూర్తంలోనే కట్టాలి.

Raksha Bandhan 2025: మీ సోదరుడికి రాఖీ కట్టేటప్పుడు ఈ 10 తప్పులు చేయొద్దు.. జాగ్రత్త..

Raksha Bandhan

Updated On : August 8, 2025 / 12:38 PM IST

హిందూ క్యాలెండర్ ప్రకారం రాఖీ పౌర్ణమి శ్రావణ మాస పౌర్ణమి రోజున వస్తుంది. ఈ సారి రాఖీ పౌర్ణమి శనివారం వచ్చింది. సోదరులకు రాఖీని కట్టి వారి రక్షణ, దీర్ఘాయుష్షు కోసం ప్రార్థిస్తారు సోదరీమణులు.

అయితే ఈ పండుగను జరుపుకుంటున్నప్పుడు కొన్ని చేయాల్సినవి, చేయరానివి గుర్తుంచుకోవాలి. రాఖీ పౌర్ణమి రోజున చేయకూడని 10 అంశాలు చూద్దాం..

Also Read: ట్రంప్‌ టారిఫ్‌ ఎఫెక్ట్‌ మామూలుగా లేదుగా.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎంతగా పెరిగాయంటే?

  • దేవతలకు ముందుగా రాఖీ కట్టకపోవడం వంటి పనులు చేయకూడదు. అంటే ముందుగా రాఖీని వినాయకుడు, శివుడు, హనుమంతుడు, శ్రీకృష్ణుడు వంటి దేవుళ్ల విగ్రహాలకు కట్టాలి. ఇలా చేయడం శుభప్రదమని భావిస్తారు.
  • శుభ ముహూర్తాన్ని పట్టించుకోకపోవడం వంటి పనులు చేయకూడదు. అంటే రాహుకాలం లేదా భద్రకాలంలో రాఖీ కట్టడం దురదృష్టం తెస్తుందని నమ్మకం ఉంది. పంచాంగంలో సూచించిన శుభ ముహూర్తంలోనే కట్టాలి.
  • చినిగిన లేదా నలుపు రంగు రాఖీలను ఉపయోగించకూడదు. నలుపు, చినిగిన, విరిగిన రాఖీలు అశుభంగా భావిస్తారు. ఇవి ప్రతికూల శక్తులను తెచ్చిపెట్టవచ్చని నమ్మకం.
  • అపవిత్రమైన లేదా ప్లాస్టిక్ రాఖీ కట్టడం వంటి పనులు చేయకూడదు. ప్లాస్టిక్‌తో చేసిన, అశుభ చిహ్నాలు ఉన్న, దేవతా చిత్రాలతో కూడిన రాఖీలు ఉపయోగించరాదు.
  • తల కప్పుకోకుండా రాఖీ కట్టడం వంటి పని చేయొద్దు. రాఖీ వేడుకలో సోదరి, సోదరుడు ఇద్దరూ తల కప్పుకోవడం సంప్రదాయం, పవిత్రతకు గుర్తు.
  • రక్షాబంధన్ మంత్రం జపించకుండా రాఖీ కట్టకూడదు. రాఖీ కడుతున్నప్పుడు ఈ మంత్రాన్ని జపించాలి – “యేన బద్ధో బాలిరాజా దానవేంద్రో మహాబలః, తేన త్వాం ప్రతిబధ్నామి రక్షే మాచల మాచల” ఇది సోదరుడికి దివ్యరక్షణను ప్రసాదిస్తుంది.
  • తప్పుగా తిలకాన్ని పెట్టకోకూడదు. తిలకానికి రోలీ (కుంకుమ) లేదా చందనం మాత్రమే ఉపయోగించాలి. సింధూరం వద్దు. అలాగే వాడే అక్షింతలు పగలకుండా ఉండాలి.
  • రాఖీ కడుతున్నప్పుడు సోదరుడు దక్షిణ దిశ వైపు చూడకూడదు.
  • విరిగిన దీపం వాడడం లేదా దక్షిణ ఇవ్వకపోవడం వంటి పనులు చేయకూడదు.
    హారతికి విరిగిన దీపాన్ని ఉపయోగించరాదు. హారతి తరువాత సోదరుడు తన స్థానంలో నుంచే దక్షిణ (చిన్న కానుక-కట్నం) ఇవ్వాలి.
  • రాఖీ తరువాత పెద్దల పాదాభివందనం చేయకపోతే మంచిది కాదు. రాఖీ కట్టిన తరువాత సోదరుడు తన అక్క కాళ్లను మొక్కాలి. సోదరుడు పెద్దవాడైతే సోదరి అతడికి పాదాభివందనం చేయాలి.