రిపబ్లిక్ డే రోజున ఏపీలో దారుణాలు : ఇద్దరు బాలికలపై అత్యాచారం, హత్య

రిపబ్లిక్ డే రోజున ఏపీలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో దారుణాలు జరిగాయి. కామాంధులు రెచ్చిపోయారు. ఇద్దరు బాలికలపై అత్యాచారం చేశారు. ఓ ఘటనలో అత్యాచారం చేశాక హత్య

  • Published By: veegamteam ,Published On : January 26, 2020 / 06:38 AM IST
రిపబ్లిక్ డే రోజున ఏపీలో దారుణాలు : ఇద్దరు బాలికలపై అత్యాచారం, హత్య

Updated On : January 26, 2020 / 6:38 AM IST

రిపబ్లిక్ డే రోజున ఏపీలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో దారుణాలు జరిగాయి. కామాంధులు రెచ్చిపోయారు. ఇద్దరు బాలికలపై అత్యాచారం చేశారు. ఓ ఘటనలో అత్యాచారం చేశాక హత్య

రిపబ్లిక్ డే రోజున ఏపీలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో దారుణాలు జరిగాయి. కామాంధులు రెచ్చిపోయారు. ఇద్దరు బాలికలపై అత్యాచారం చేశారు. ఓ ఘటనలో అత్యాచారం చేశాక హత్య కూడా చేశాడు. శ్రీకాకుళం జిల్లాలో ఘోరం జరిగింది. ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం జరిగింది. ఆ తర్వాత హత్య చేశాడు. వజ్రపుకొత్తూరు మండలం ధర్మపురం ఈ ఘటన జరిగింది. ధర్మపురం సమీపంలోని రైలు పట్టాలపై బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. నిందితులు కాశీబుగ్గ పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

5

ఇక నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో మరో దారుణం జరిగింది. కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ ఆటో డ్రైవర్.. బాలికపై అత్యాచారం చేశాడు. బాలిక స్పృహ కోల్పోవడంతో ముళ్లపొదల్లో పడేసి పారిపోయాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. నిందితుడు రసూల్ కోసం గాలిస్తున్నారు.

నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్ చేసినా కామాంధుల్లో మార్పు రావడం లేదు. ఓవైపు నిర్భయ దోషులను ఉరి తీసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయినా మృగాళ్లు భయపడటం లేదు. కామంతో కళ్లు మూసుకుపోయి దారుణాలకు తెగబడుతున్నారు. చిన్న పిల్లలపైనా అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. అమ్మాయికి రక్షణ కరువైంది. ఎప్పుడు ఎటువైపు నుంచి ఏ మృగాడు దాడి చేస్తాడోనని భయపడుతున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన అమ్మాయి తిరిగి సురక్షితంగా ఇంటికి వస్తుందో లేదోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.