ఒక్క రోజులో రేషన్‌ కార్డు.. ఏపీలో సరికొత్త రికార్డ్

  • Publish Date - September 17, 2020 / 07:26 AM IST

ration-card

నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందివ్వాలంటే.. ముందుగా కావలసిన కార్డు రేషన్ కార్డు.. రేషన్ కార్డు లేనిదే అర్హులైనా కూడా సంక్షేమ పథకాలు అందని పరిస్థితి. ఆ రేషన్‌ కార్డు రావాలంటే సామాన్యుడు ఆఫీసుల చుట్టు తిరగాల్సిన పరిస్థితి. అన్నీ అర్హతలు ఉన్నా.. రేషన్ కార్డు వస్తుందనే గ్యారెంటీ లేదు.




అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క రోజులోనే రేషన్ కార్డు అందజేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం మడికి గ్రామంలో సచివాలయం-2 పరిధిలో ఉంటున్న కుడిపూడి ఆంజనేయులు, వరలక్ష్మి దంపతులు ఎన్నోసార్లు రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా ప్రయోజనం కలగలేదు. అయితే చివరకు గ్రామ వలంటీర్‌‌ను కలవగా.. గ్రామ సచివాలయానికి తీసుకెళ్లి వివరాలు నమోదు చేయించి ఒక్క రోజులో రేషన్ కార్డు వచ్చేలా చేశారు.
https://10tv.in/e-gopala-app-cows-and-buffalos-what-is-pashu-aadhaar-card-how-will-farmers-get-the-benefit-know-everything/
దరఖాస్తును ఆన్‌లైన్‌ ద్వారా తహసీల్దార్‌ జి.లక్ష్మీపతికి సమర్పించ లబ్ధిదారుని అర్హతల్ని గుర్తించి రేషన్‌ కార్డు మంజూరు చేశారు. అదే గ్రామానికి చెందిన పిల్లి లక్ష్మి అనే ఒంటరి మహిళకు కూడా ఒక్క రోజులోనే రేషన్‌ కార్డు మంజూరైంది. అర్హతలు ఉన్న వారు వలంటీర్‌ ద్వారా దరఖాస్తు చేసుకుంటే గ్రామ సచివాలయం ద్వారా ఒకటి నుంచి పది రోజుల్లో కార్డు వచ్చేస్తుందని అధికారులు చెబుతున్నారు.