తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్‌లకు భారీగా విరాళాలు వచ్చాయి. 11 నెలల్లో రికార్డు స్థాయిలో రూ.918.6 కోట్లు విరాళాలు ( 2024 నవంబర్ 1 నుంచి -2025 అక్టోబర్ 16వ తేదీ వరకు) దక్కాయి.
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక టీటీడీకి దాతలు క్రమంగా పెరుగుతున్నారు. టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టాక టీటీడీ ట్రస్ట్‌లకు వెల్లువలా విరాళాలు వస్తున్నాయి.
దాతలకు తగిన గౌరవం, సదుపాయాలు కల్పించడంలో ఎక్కడా లోపం తలెత్తకూడదని బీఆర్ నాయుడు అదేశాలు ఇచ్చారు. ట్రస్ట్‌లకు విరాళాలతో పాటు పలు నిర్మాణాలు, యంత్రాల కొనుగోలు, సాంకేతిక అభివృద్ధికి దాతలు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. అత్యధికంగా ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్ కు రూ.338.8 కోట్ల విరాళం వచ్చింది.
ఆఫ్ లైన్ కంటే ఆన్ లైన్ ద్వారానే ఎక్కువ సంఖ్యలో విరాళాలు సమర్పిస్తున్నారు. ఆన్ లైన్ ద్వారా రూ. 579.38 కోట్లు, ఆఫ్ లైన్ ద్వారా రూ.339.20 కోట్ల విరాళాలు అందించారు.
Also Read: ప్రసిద్ధ నటుడు అస్రానీ ఇకలేరు.. ఆయన 5 దశాబ్దాల సినీ ప్రస్తానాన్ని గుర్తుచేసుకుంటున్న బాలీవుడ్