RK Beach: ఆర్కే బీచ్‌లో విషాదం.. న్యూ ఇయర్ వేడుకలకు వచ్చి ఐదుగురు గల్లంతు
న్యూ ఇయర్ వేడుకల కోసం ఆర్కే బీచ్ కు వచ్చిన ఐదుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. వీరిలో ఒడిశాకు చెందిన నలుగురితో పాటు మరో వ్యక్తి ఉన్నట్లు తెలుస్తుంది. వీరిలో సునీత త్రిపాఠితో పాటు....

vizag rk beach
RK Beach: న్యూ ఇయర్ వేడుకల కోసం ఆర్కే బీచ్ కు వచ్చిన ఆరుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. సికింద్రాబాద్ కు చెందిన 8మంది యువకులు ఆదివారం మధ్యాహ్నం ఆర్కే బీచ్ చేరుకున్నారు. నీళ్లల్లో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తుండగా పెద్ద కెరటాలు రావడంతో ముగ్గురు యువకులు నీటిలో కొట్టుకుపోయారు. అలర్ట్ అయిన లైఫ్ గార్డ్స్ కొద్దిసేపటి తర్వాత శివను ఒడ్డుకు తీసుకురాగలిగారు. హాస్పిటల్ కు తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించే లోపే తుది శ్వాస విడిచాడు. కే శివ, మహ్మద్ అజీజ్ కోసం గాలిస్తున్నారు.
ఒడిశాకు చెందిన ఐదుగురు వ్యక్తులు కూడా గల్లంతు అయినట్లు తెలుస్తుంది. వీరిలో సునీత త్రిపాఠి ప్రాణాలు కోల్పోగా మరో నలుగురికి ప్రాణాపాయం తప్పింది. హైదరాబాద్ బేగంపేటకు చెందిన శివ, అజీజ్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడానికి డిసెంబర్ 30న హైదరాబాద్ నుంచి విశాఖ చేరుకున్నారు. సెలబ్రేషన్స్ ముగించుకుని జనవరి 2 సాయంత్రం తిరిగి హైదరాబాద్ వెళ్లేందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు.
సునీత, శివ మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం కేజీహెచ్ హాస్పిటల్ కు తరలించారు.
ఇది వీక్షించండి: మనోళ్ళని ఫిదా చేసేస్తున్న నేపాలీ భామ అదితి!